అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నేటితో రెండో రోజుకు చేరుకుంది. ఈ సేల్ లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. దీంతో మీరు బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక తక్కువ ధరకే మంచి ఫీచర్లు కలిగిన బెస్ట్ రిఫ్రిజిరేటర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి Samsung, LG ఇంకా Whirlpool వంటి టాప్ బ్రాండ్స్ రిఫ్రిజిరేటర్లు మంచి డిస్కౌంట్ ధరకు వస్తున్నాయి. ఇక Whirlpool 235 L 2 Star రిఫ్రిజిరేటర్ రూ. 21,990 ఆఫర్ ధరకు వస్తుంది. ప్రస్తుతం ఈ ఫ్రిజ్ 27% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ రిఫ్రిజిరేటర్ పై రూ. 1,250 కూపన్ డిస్కౌంట్ ఉంటుంది. అలాగే SBI డెబిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ వర్ల్పూల్ ఫ్రిడ్జ్ ను కేవలం రూ. 19,490 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్రిడ్జ్ -24 ఫ్రీజర్ తో వస్తుంది. ఇంకా ఇది కాకుండా ఈ ఫ్రిజ్ మంచి డిజైన్, సూపర్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
ఇక LG 185 L 5 Star రూ. 17,290 ఆఫర్ ధరతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పై 22% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఈ ఫ్రిడ్జ్ ను తక్కువ ధరకు పొందడానికి వీలుగా రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. దీన్ని SBI డెబిట్ కార్డ్ ఆఫర్ తో కొనే వారికి రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ ను కేవలం రూ. 15,040 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ రిఫ్రిజిరేటర్ స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్, సూపర్ డిజైన్ ఇంకా మంచి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
ఇక Samsung 183 L 4 Star ని ఆఫర్ ధరతో కేవలం రూ. 15,990 కే కొనుగోలు చేయవచ్చు. ఈ రిఫ్రిజిరేటర్ ని 30% డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఇది కాకుండా ఈ రిఫ్రిజిరేటర్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. దీన్ని SBI డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసేవారికి రూ. 1,250 రూపాయల డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంటే, అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ రిఫ్రిజిరేటర్ ని కేవలం రూ. 13,740 రూపాయల ఆఫర్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్రిడ్జ్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, మంచి డిజైన్ ఇంకా సూపర్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.