హ్యుందాయ్ క్రెటా ఈవీ vs మిగతా ఈవీలు.. ఏది బెస్ట్, బ్యాటరీ సామర్థ్యం ఎంత

www.mannamweb.com


దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా ఈవీని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం చాలా మంది వినియోగదారు సుదీర్ఘకాలంగా వెయిట్ చేస్తున్నారు. కంపెనీ గత కొన్ని రోజులుగా దాని టీజర్‌లను కూడా విడుదల చేస్తూ అంచనాలను పెంచేసింది. వాటన్నింటికీ ముగింపు పలుకుతూ కంపెనీ అధికారిక ఫోటోలతో పాటు దాని వివరాలను షేర్ చేసింది. కొత్త హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ జనవరి 17 నుండి ప్రారంభమయ్యే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో అమ్మకానికి విడుదల చేయబడుతుంది. కాబట్టి క్రెటా ఎలక్ట్రిక్ ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం.

లుక్, డిజైన్:
డిజైన్ పరంగా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ దాని ICE-ఆధారిత (పెట్రోల్-డీజిల్) మోడల్‌కు చాలా దగ్గర పోలికలను కలిగి ఉంటుంది. చాలా బాడీ ప్యానెళ్లలో ఎలాంటి మార్పు లేదు. ముందు భాగంలో L-ఆకారంలో కనెక్ట్ చేయబడిన LED DRLలు, నిలువుగా ట్విన్ LED హెడ్‌లైట్లు ఉన్నాయి. హ్యుందాయ్ లోగో వెనుక ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. 17-అంగుళాల ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ క్రెటా ఈవీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వెనుక వైపున, కనెక్ట్ చేయబడిన LED టెయిల్‌లైట్లు, కొత్త పిక్సలేటెడ్ డిజైన్ బంపర్ ఇతర మోడళ్ల నుండి భిన్నంగా ఉంటాయి.

కారు లోపలి భాగంలో, క్రెటా ఎలక్ట్రిక్ డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంది. గ్లోబల్ మార్కెట్లో లభించే కోనా ఎలక్ట్రిక్ నుండి ప్రేరణ పొందిన స్టీరింగ్ వీల్ ఇచ్చింది కంపెనీ. ఇది కొత్త ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ డిజైన్‌ను పొందుతుంది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్, వెహికల్ టు లోడ్ (V2L) టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, ADAS సూట్, హ్యుందాయ్ డిజిటల్ కీ ఫీచర్‌తో అందించబడుతోంది.

బ్యాటరీ ప్యాక్, పరిధి:
క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో వస్తోంది. ఇందులో 42kWh, 51.4kWh బ్యాటరీలు ఉన్నాయి. ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు వరుసగా 390 కిమీ, 473 కిమీల మేర ఒకసారి చార్జీ చేస్తే ప్రయాణించవచ్చు. క్రెటా ఎలక్ట్రిక్ (లాంగ్ రేంజ్) 7.9 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదని హ్యుందాయ్ పేర్కొంది. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్ వంటి మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది స్టీరింగ్ కాలమ్-మౌంటెడ్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్‌ను కలిగి ఉంది, ఇది లోనిక్ 5 లాగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ రేంజ్

ఎలక్ట్రిక్ ఎస్ యూవీల బ్యాటరీ స్పెసిఫికేషన్లు
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 42 కిలో వాట్స్ & 51.4 కిలో వాట్స్
మారుతి సుజుకి ఇ విటారా 49కిలో వాట్స్ & 61 కిలో వాట్స్
మహీంద్రా బీఈ 6 59 కిలో వాట్స్ & 79 కిలో వాట్స్
టాటా కర్వ్ ఈవీ 45 కిలో వాట్స్ & 55కిలో వాట్స్
ఎంజీ జెడ్ ఎస్ ఈవీ 50.3 కిలో వాట్స్

ఒక్క సారి చార్జ్ చేస్తే ప్రయాణించే దూరం

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 390 కి.మీ & 473 కి.మీ
మారుతి సుజుకి ఇ విటారా 550 కి.మీ వరకు
మహీంద్రా బీఈ 6 535 కి.మీ & 682 కి.మీ
టాటా కర్వ్ ఈవీ 502 కి.మీ & 585 కి.మీ
ఎంజీ జెడ్ ఎస్ ఈవీ 461 కి.మీ

పై విషయాలను దృష్టిలో ఉంచుకుని ఏది బెస్ట్ అనేది కొనుగోలు దారులు నిర్ణయం తీసుకోవచ్చు.

58 నిమిషాల్లో ఛార్జ్:
క్రెటా ఎలక్ట్రిక్ కేవలం 58 నిమిషాల్లో (DC ఛార్జింగ్) 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుందని హ్యుందాయ్ పేర్కొంది, అయితే 11 కిలో వాట్స్ ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్ 4 గంటల్లో 10 శాతం నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. క్రెటా ఎలక్ట్రిక్ 4 వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది – ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్. ఈ ఎస్ యూవీ 8 మోనోటోన్, 2 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లతో అందించబడుతోంది.

దీనితో పోటీ ఉంది:
కంపెనీ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై చాలా కాలంగా పనిచేస్తోంది. ఇది వివిధ సందర్భాలలో చాలా సార్లు గుర్తించబడింది. మార్కెట్‌లో ఇది మారుతి రాబోయే మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ విటారా, మహీంద్రా బీఈ 6, టాటా కర్వ్ ఈవీ వంటి కార్లతో పోటీపడుతుంది. దీనికి కంపెనీ ఎలాంటి ధరను నిర్ణయిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.