మీ తమ్ముడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను: పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవిని యూకేలో సత్కరించడంతో పాటు.. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డుపై చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.


‘మీ తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య గారి కీర్తిని మరింత పెంచనుంది. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.