యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala), అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
కొద్ది కాలంపాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ రెస్పాండ్ కాకుండా.. ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చారు. సింపుల్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత చైతు వరుస చిత్రాల్లో నటిస్తూ హిట్స్ సాధిస్తున్నాడు. కానీ శోభిత మాత్రం కొద్ది రోజులు పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ఆసక్తికర కామెంట్స్ చేసింది.
వివాహం జరిగి ఏడాది పూర్తి కావడంతో తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు విషయాలు వెల్లడించింది. ”ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. చైతుని పెళ్లి చేసుకున్నాక ఎన్నో చేయాలనుకున్నాను. హైదరాబాద్ మొత్తం చుట్టేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. 2 సినిమాలతో బిజీ కావడం వల్ల నా కల నెరవేరలేదు. పెళ్లి తర్వాత దాదాపు 160 రోజులపాటు ఆ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొన్నాను. దాని కోసం ఎక్కువగా తమిళనాడులోనే ఉండాల్సి వచ్చింది. వివాహం తర్వాత నా భర్తను విడిచి ఉండాల్సిన రోజులు పెళ్లి తర్వాత వస్తాయని అస్సలు అనుకోలేదు” అని చెప్పింది.
ఆ తర్వాత యాంకర్ తన వైవాహిక జీవితం గురించి ప్రశ్నించగా..”మనకు ఏదైనా ఒక విషయం నచ్చింది అంటే దానిని ఎలాగైనా సరే సాధిస్తాము. ఇక నచ్చకపోతే ఎంత సులభమైన పనైనా సరే కష్టంగా అనిపిస్తుంది” అని అన్నారు. శోభిత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా.. నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృష కర్మ’ మూవీ చేస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

































