తెలుగులో ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం.. సంజయ్ దత్ ఆసక్తికర కామెంట్స్

న్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘కేడీ ది డెవిల్’.


ఈ ను ప్రేమ్ తెరకెక్కించారు. ఈ మూవీలో ధృవ సర్జాకు జోడిగా రీష్మా నానయ్య నటించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి వంటి వారంతా ముఖ్య పాత్రల్ని పోషించారు. గురువారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..

సంజయ్ దత్ మాట్లాడుతూ .. ‘హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ఎంతో మందితో కలిసి పని చేశాను. మరీ ముఖ్యంగా నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను ప్రభాస్ రాజా సాబ్‌ కు పని చేస్తున్నాను. అక్కడే తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుగులో చిరంజీవి గారంటే చాలా ఇష్టం. కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంకీ సర్, సుప్రిత్‌లకు పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ఇలాంటి మూవీని ఇంత గొప్పగా నిర్మించగలిగారు. డైరెక్టర్ ప్రేమ్ చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. రీష్మా చాలా చక్కగా నటించారు. ధృవ్ నా తమ్ముడులాంటివారు. ధృవ చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా ను అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

ధృవ సర్జా మాట్లాడుతూ .. ”కేడీ’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కెమెరామెన్ విలియం, మా నిర్మాత వెంకట్, సుప్రిత్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ అందరికీ ధన్యవాదాలు. నాకు సంజయ్ దత్ గారు అంటే ఎంతో ఇష్టం. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. శిల్పా శెట్టి వంటి యాక్టర్లతో పని చేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. సెట్స్ మీద ఆమె మా యాక్టింగ్‌ను కరెక్ట్ చేస్తుంటారు. రీష్మా మంచి నటి. మా మూవీ త్వరలోనే రాబోతోంది. అందరూ చూడండి. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

శిల్పా శెట్టి మాట్లాడుతూ .. ‘హిందీలో కాకుండా నేను మొదటగా తెలుగులో ను చేశాను. సాహసవీరుడు సాగర కన్య అని ను చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు వారు నాపై అదే ప్రేమను చూపిస్తున్నారు. సత్యవతి పాత్రను నాకు ఇచ్చిన డైరెక్టర్ ప్రేమ్ గారికి థాంక్స్. కేవీఎన్ వెంకట్ గారికి పట్ల చాలా ప్యాషన్ ఉంది. ధృవ, రీష్మాలతో పని చేయడం సంతోషంగా ఉంది. సంజయ్ దత్ గారితో నేను చేసిన ప్రతీ హిట్ అయింది. అదే ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ఈ మూవీని ప్రేమ్.. ఎంతో ప్రేమతో తెరకెక్కించారు’ అని అన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.