నా ప్రయాణం ముగిసింది.. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానంటూ ఉపాసన భావోద్వేగ పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన(Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.


అలాగే ఎంతోమందికి అపోలో హాస్పిటల్ ద్వారా సాయం అందిస్తూ ప్రశంసలు పొందుతోంది. ఇక ఇటీవల గురు పౌర్ణమి నాడు ఉపాసన తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్లిన్ కారా నర్స్ లతా సిస్టర్‌తో కలిసి ప్రారంభించినట్లు వెల్లడించింది. తాజాగా, ఈ వ్రతాన్ని పూర్తైనట్లు ఉపాసన తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది.

”గురు పౌర్ణమి నాడు నేను ప్రారంభించిన నా సాయిబాబా వ్రతం 9 వారాల పాటు కొనసాగింది. శాంతి, స్వస్థత, విశ్వాసంతో నా ప్రయాణం ముగిసింది. నేను ఈ వ్రతాన్ని కారా నర్సు లతా సిస్టర్‌తో కలిసి ప్రారంభించాను. నేను అడిగిన దానికంటే దేవుడు ఎక్కువ ఆశీర్వదించినందుకు బాబాకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. మీ కృపతో నా జీవితంలో ఎక్కువ మందికి సేవ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే నిత్యం మాకు రక్షణగా ఉన్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అత్తమ్మాస్ కిచెన్ తరపున ఈ రోజు భోజనం వడ్డిస్తున్నాము.. జై సాయిరామ్” అనే క్యాప్షన్ జత చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ ఉపాసన ఎంత బిజీ ఉన్నప్పటికీ ఇలా చేయడం గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.