ఆ బిల్లును ఆమోదిస్తే.. రేపే కొత్త పార్టీ పెడతా.. ఎలాన్‌ మస్క్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతుంది. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన పన్ను, వలసల బిల్లుపై ఎలాన్ మస్క్ బహిరంగంగా యుద్ధం ప్రకటించారు. ఈ బిల్లు దేశానికి హానికరమని.. ఈ బిల్లు ఆమోదం పొందితే తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని కూడా మస్క్ హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్ ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరిట ఈ ప్యాకేజీని తీసుకొచ్చారు. ఈ బిల్లు ద్వారా తొలుత ప్రవేశపెట్టిన పన్ను కోతలను 4.5 ట్రిలియన్ డాలర్ల వరకు పొడిగించడం, సైనిక వ్యయాన్ని పెంచడం, వలసదారుల బహిష్కరణలకు నిధులు సమకూర్చడం వంటివి ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ అయితే ట్రంప్‌ తీసుకొచ్చిన ఈ బిల్లు కారణంగా దేశంపై పదేళ్లలో 3.3 ట్రిలియన్ డాలర్లకు పైగా అప్పు భారం పడుతోందని అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ క్రమంలోనే ఇదువరకు ట్రంప్‌కు సలహాదారుగా పనిచేసిన ఎలాన్ మస్క్ ఆయన తెచ్చిన బిల్లుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో “ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చాక అతిపెద్ద అప్పుకు ఓటు వేస్తున్న ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తన జీవితంలో చివరి పనైనా సరే, వచ్చే ప్రైమరీ ఎన్నికల్లో వారిని ఓడించేందుకు ప్రయత్నిస్తానని మస్క్ తన ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

ఇదే కాకుండా మస్క్‌ మరో సంచలన ప్రకటన కూడా చేశారు. ట్రంప్ తీసుకొచ్చిన ఈ వ్యయ బిల్లు కానీ పాసైతే, బిల్లు పాసైన తర్వాతి రోజే తాను ‘అమెరికన్ పార్టీ’ని స్థాపిస్తానని మస్క్ అన్నారు. డెమోక్రాట్-రిపబ్లికన్ ఏకపార్టీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం దేశంలో పార్టీలు పుట్టుకురావాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. అప్పుడే ప్రజల తమ గొంతును బలంగా వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. సెనేట్‌లో చర్చకు రాబోతున్న వెయ్యి పేజీల ముసాయిదా బిల్లును “పూర్తిగా పిచ్చిదని మస్క్‌ అన్నారు. ఈ బిల్లు దేశానికి హానికలిగించడమే కాకుండా దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులను నాశనం చేస్తుంది మస్క్‌ విమర్శించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.