మొత్తం పోస్టుల సంఖ్య: 500.పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఓ)-500(యూఆర్-203, ఎస్సీ-75,ఎస్టీ-37, ఈడబ్ల్యూఎస్-50, ఓబీసీ-135)
జోన్‌లు: అహ్మదాబాద్, భోపాల్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్, పుణె, భువనేశ్వర్, పాట్నా, చండీగఢ్, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.01.2024 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారు పర్సనల్ ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు. ప్రతిభ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం(6 నెలలు)లో నెలకు రూ.5000 ఇస్తారు. ఇంటర్న్‌షిప్(రెండు నెలలు) సమయంలో నెలకు రూ.15,000 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకుని ఉద్యోగంలో చేరిన వారికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు వార్షిక వేతనం అందుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 12.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.02.2024
ఆన్‌లైన్ పరీక్ష తేది: 17.03.2024.
వెబ్‌సైట్: https://www.idbibank.in/