మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు (ఆగస్టు 22). చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేశారు. ఈ థియేటర్స్ లో ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. మెగాస్టార్ కు ఇది 69వ పుట్టినరోజు. ఈ వయసులోనూ ఆయన చాలా ఫిట్‌గా ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో మెగాస్టార్ ఒకరు. ఆయన ఆస్తులు, ఆయన దగ్గర ఉన్న ఖరీదైన కార్లు వివరాలు ఒక్కసారి చూద్దాం.! చిరంజీవి 150కి పైగా ల్లో నటించారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులు అందుకున్నారు. ఆయన ఆస్తి విలువ సుమారు 1650 కోట్ల రూపాయలు.అలాగే ఆయనకు చాలా చోట్ల ఖరీదైన ఇళ్లు ఉన్నాయి.
మెగాస్టార్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 25 వేల చదరపు అడుగుల ఇల్లు ఉంది. బెంగుళూరు విమానాశ్రయానికి సమీపంలో ఓ ఫామ్‌హౌస్ ఉంది. ఈ ఫామ్‌హౌస్ అంటే మెగాస్టార్ కు చాలా ఇష్టం. అలాగే చిరంజీవికి చెన్నైలో ఓ ఇల్లు కూడా ఉంది. 90వ దశకంలో ఫిలింనగర్‌లో భూమి కొన్నాడు చిరు. ఆతర్వాత దాన్ని 70 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. వీటితో పాటు చిరంజీవికి ప్రైవేట్ జెట్ ఉంది. ఇక కార్ల విషయానికొస్తే మెగాస్టార్ దగ్గర రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. దీని ధర దాదాపు 9-10 కోట్ల రూపాయలు. అలాగే ఆయన దగ్గర రేంజ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి కేరళ బ్లాస్టర్ ఎఫ్‌సికి యజమాని కూడా. నాగార్జున, సచిన్ టెండూల్కర్ కూడా దాని యజమానులుగా ఉన్నారు.
చిరంజీవికి అంజనా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఇది 1988లో స్థాపించారు. తన సోదరుడు నాగేంద్రబాబుతో కలిసి దీన్ని ప్రారంభించారు. తల్లి అంజనా దేవి పేరు మీద చిరంజీవి ఈ ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేశారు.లతో పాటు ఎన్నో సామజిక కార్యక్రమాలు కూడా చేశారు చిరు. ఆయన పేరు మీద బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కూడా ఉంది. ప్రస్తుతం చిరంజీవి 157మూవీ విశ్వంభర చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.