మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు డయాబెటిస్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
అంతేకాదు దానికి సరిపోయే డైట్ కూడా పాటించాలి. ప్రతిరోజు మెడిసిన్ కూడా వేసుకోవడం ఎంతో మంచిది. కొంతమందికి ఇన్సులిన్ కూడా సూచిస్తారు. అయితే ఇన్సులిన్ నిరోధకతకు తోడ్పడే ఔషధ గుణాలు ఉండే కూరలు డైట్లో చేర్చుకోవడం మంచిది.
పాలకూర..
కొన్ని నివేదికలకు ప్రకారం పాలకూరలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ నిరోధకతకు సహాయపడుతుంది. పాలకూరలో ఉండే మెగ్నీషియం షుగర్ స్థాయిలను తగ్గించేస్తుంది. సెల్ డామేజ్ కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కాపాడుతాయి. కార్బోహైడ్రేట్, క్యాలరీలో మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. మన దగ్గర డైట్ లో పాలకూరను కూర లేదా పప్పులో వేసుకొని తినవచ్చు
బ్రోకోలి
బ్రోకోలి క్రూసిఫెరస్ జాతికి చెందిన ఒక కూరగాయ. ఇందులో విటమిన్ సి. విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బ్రోకోలి తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. డయాబెటిస్ వారికి గుండె ఆరోగ్యానికి కూడా ఇది సహాయపడుతుంది.
క్యారట్..
క్యారట్ లో కూడా డైటరీ ఫైబర్, విటమిన్ ఏ ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావలసిన విటమిన్స్ ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. క్యారెట్లు షుగర్ నియంత్రిస్తాయి. గ్లైసెమిక్ సూచీ కూడా ఇందులో తక్కువగా ఉంటుంది. కాబట్టి క్యారట్ కర్రీ లేదా జ్యూస్ తాగవచ్చు
క్యాబేజీ..
క్యాబేజీలో కూడా విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాబేజీ గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అందుకే డయాబెటిస్ వారు ఈ క్యాబేజీని రెగ్యులర్ గా తినాలి. ఇది రక్తంలో చక్కెర నియంత్రించే గుణం కూడా కలిగి ఉంటుంది. దీన్ని సలాడ్ లేదా కూర రూపంలో తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు
అస్పర్గస్..
అస్పర్గస్ లో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ నియంత్రణకు ఇది ఎంతో మంచిది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర నెమ్మదిస్తుంది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు మెటబాలిక్ రేటును పెంచి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ కూడా ఎక్కువగా ఉంటాయి.
































