అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉత్తర అమెరికాలోని అలస్కాలో చర్చలు జరగనున్నాయి. ఇరుదేశాల అధ్యక్షులు ముఖాముఖి పలు అంశాలపై చర్చించనున్నారు.
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అన్ని దేశాల పైన సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తరలిపిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకొని ఉంది. ఈ భేటీ అనంతరం చర్చలు సఫలం అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య, రాజకీయ రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చర్చలలో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మాజీ అధ్యక్షుడు బిడెన్ ఉక్రెయిన్ – రష్యా యుద్ధానికి వెన్ను తానుగా నిలబడ్డాడని, తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ట్రంప్ ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చినట్లయితే రష్యా – ఉక్రెయిన్ మధ్య సమస్యను పరిష్కరిస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ట్రంప్, పుతిన్ మధ్య జరగనున్న ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఉక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి ఇవ్వడంతో పాటు భూభాగాల మార్పిడిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు భవిష్యత్తులో ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరాలా వద్దా అనే అంశం పైన కూడా చర్చ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అమెరికా రష్యా మధ్య ఆర్థిక సహకారం వాణిజ్యం వంటి విషయాల పైన కూడా చర్చలు జరిగే అవకాశం ఉంటుందని వైట్ హౌస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు సఫలం అయితే అటు బంగారం ధరలు కూడా తగ్గి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా మధ్య ఉన్నటువంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో అతలాకుతలం అవుతున్నాయి. ఈ సమస్యకు ముగింపు దొరికినట్లైతే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో స్టెబిలిటీ కనిపిస్తుంది. . దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి సాంప్రదాయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టే అవకాశం ఉంటుంది.
రష అధ్యక్షుడు పుతిన్ ఈ చర్చల్లో భాగంగా అమెరికాతో రష్యా సంబంధాలను మెరుగుపరుచుకున్నట్లయితే, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రంగానికి ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ స్థిరపడటంతో పాటు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారం ధరలు తగ్గవచ్చు. అలాగే రష్యా వద్ద సెంట్రల్ బ్యాంకులో టన్నుల కొద్ది బంగారు నిలువలు ఉన్నాయి. ఒకవేళ రష్యా అధిక పరిస్థితి బాలేక పోతే ఈ బంగారాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించే అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న సందర్భాల్లో రష్యా కనుక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లయితే బంగారం ధర 20 నుంచి 30% మేర తగ్గే అవకాశం ఉంటుందని వాణిజయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు, పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
































