మూడవ ప్రపంచ యుద్ధం వస్తే… ఈ దేశాలు సురక్షితంగా ఉంటాయా ?

ప్రస్తుతం అనేక దేశాలు అణు బాంబులు కలిగి ఉన్నాయి. అయితే జపాన్ బాంబు దాడులకు సంబంధించి హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు కనిపిస్తుండటం వల్ల వాటిని ఉపయోగించడానికి ప్రభుత్వాలు ఇష్టపడటంలేదు. జపాన్ అణు యుద్ధాన్ని చూసిన వారు ఇప్పుడు దాదాపుగా ఎవరూ లేరు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఎక్కడో చోట ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో న్యూక్లియర్ వార్ భయాలు నెలకొన్నాయి. ఒకవేళ అణు యుద్ధం సంభవించినా ఓ 5 నుంచి 10 దేశాలు మాత్రం సురక్షితంగా ఉంటాయట. వాటి ప్రత్యేక భౌగోళిక స్థితి, తటస్థ వైఖరితో అణు దాడి నుంచి తమ ప్రజలను రక్షించుకోగలవు అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం అప్రకటిత మూడో ప్రపంచ యుద్ధంలోకి వెళ్లిపోయింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య బాంబుల మోతలు ఇంకా అలాగే ఉండగానే.. పశ్చిమాసియా రగులుతోంది. అంతకంతకూ యుద్ధం విస్తరించుకుంటూ పోతోంది. ఇజ్రాయెల్ , ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. ఇది పశ్చిమాసియా మొత్తాన్ని సర్వనాశనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.