Whatsappలో ఈ చిన్న తప్పు చేశారంటే.. మీ అకౌంట్‌ బ్లాక్ అవుతుంది!

www.mannamweb.com


ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు వాట్సాప్ ను వినియోగించేవారే. వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చాక సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం మరింత సులభమైపోయింది. క్షణాల్లోనే కావాల్సిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా చేరవేయొచ్చు. చాట్స్, కాల్స్ తో యూజర్లు తెగ వాడేస్తుంటారు. రోజులో ఒక్కసారైనా వాట్సాప్ ని చూడని వారు ఉండరేమో కదా. మరి వాట్సాప్ యూజర్లు ఈ యాప్ ను వినియోగించే సమయంలో ఏవైనా తప్పులు చేస్తే మీ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు వాట్సాప్ సంస్థ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తుంది. భారత్ లో కూడా వాట్సాప్ వినియోగం ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే వాట్సాప్ వినియోగించేటపుడు దాని నియమ నిబంధనలకు లోబడి వ్వవహరించాల్సి ఉంటుంది. మెసేజ్ లు పంపేటపుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్‌ని నిబంధనలను ఉల్లంఘిస్తే మీ వాట్సాప్ ఖాతాను శాశ్వతంగా నిషేధించే అవకాశం ఉంది. కాబట్టి వాట్సాప్ ను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉంటే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చు.

ఇటీవల వాట్సాప్ నియమాలను ఉల్లంఘించిన దాదాపు 76 మిలియన్ల ఖాతాలను బ్లాక్‌ చేసింది. మత విధ్వేషాలను రెచ్చగొట్టే విధంగా, అల్లర్లకు తెరలేపే విధంగా మెసేజ్ లను వైరల్ చేయడంతో వాట్సాప్ సంస్థ కఠిన చర్యలు తీసుకుంది. కాబట్టి మీరు మెసేజ్ లను పంపే సమయంలో.. ఫార్వాడ్ చేసే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా మెసేజ్ లు ఉన్నట్లైతే వాట్సాప్ చర్యలు తీసుకునేందుకు వెనకాడదు.ఈ చిన్న చిన్న తప్పులు చేశారంటే మీ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.