వర్షాకాలంలో మీ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యం. మీ మొబైల్ ఫోన్ ఎక్కడైనా తడిసి పడిపోతుందేమో అనే భయం నిరంతరం ఆందోళన కలిగిస్తుంది. ఈ రోజుల్లో చాలా ఫోన్లు వాటర్ ప్రూఫ్ అయినప్పటికీ, నీటికి గురికావడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వర్షపు నీటిని గుడ్డతో తుడవడం కూడా కొన్నిసార్లు పనిచేయదు. వర్షంలో మీ మొబైల్ ఫోన్ పాడవకుండా ఉండాలంటే, ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ వాటర్‌ప్రూఫ్ ఫోనా.. కాదా అని తెలుసుకోండి. దీని కోసం మీరు ఫోన్ IP రేటింగ్‌ను తనిఖీ చేయాలి. ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు మీరు IP67, IP68, IPX8 వంటి వివిధ రేటింగ్‌ల గురించి విని ఉండవచ్చు. IP68 రేటింగ్ ఉన్న ఫోన్ 30 నిమిషాల పాటు నీటిలో మునిగిపోయినా కూడా ఎటువంటి నష్టం జరగదు. ఇది వాటర్ ప్రూఫ్ మొబైల్.
మీ ఫోన్ వాటర్ ప్రూఫ్‌గా ఉందో లేదో తనిఖీ చేయడానికి ఆ ఫోన్ కు IP68 రేటింగ్ ఉందో లేదో మీరు చూడాలి. ఫోన్‌కు IP68 రేటింగ్ లేకపోతే దానిని తడిసిపోనివ్వకండి. దీని వల్ల ఫోన్ దెబ్బతినవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో తడిసినా మీ మొబైల్ ఫోన్ వాడటానికి వాటర్ ప్రూఫ్ పర్సు తీసుకోండి. ఇది ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ కవర్. మీరు మీ ఫోన్‌ను దానిలో పెడితే, ఎన్నిసార్లు నీరు పడినా ఏమీ జరగదు. మీరు కవర్ నుండే ఫోన్‌ను ఉపయోగించవచ్చు. ఎందుకంటే వాటర్ ఫ్రూప్ పౌచ్‌లు పారదర్శకంగా ఉంటాయి. ఈ పర్సు మీ ఫోన్‌ను పూర్తిగా మూసివేస్తుంది. అలాగే నీరు లోపలికి రాకుండా నిరోధిస్తుంది. మీ ఫోన్ మోడల్‌కు అనుకూలంగా ఉండే వివిధ రకాల వాటర్‌ప్రూఫ్ కేసులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
మీరు ఏదైనా ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుండి వాటర్‌ప్రూఫ్ పౌచ్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో విక్రయిస్తున్నారు. వాటి ధర రూ. 99 నుండి ప్రారంభమవుతుంది. మీరు 300 రూపాయల వరకు ఖర్చు చేస్తే మీ ఫోన్‌ను నీటి నుండి మాత్రమే కాకుండా దుమ్ము, ధూళి నుండి కూడా రక్షించుకోవచ్చు. వర్షంలో ఫోన్ ఉపయోగించిన తర్వాత పొడి గుడ్డతో ఫోన్‌ను పూర్తిగా తుడవండి. ఛార్జింగ్ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్‌లో తేమ ఉండకుండా చూసుకోవడానికి వాటిని శుభ్రం చేయండి.
































