ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కళ్ళజోడుచాలా కామన్ అయిపోయింది.దీనికి కారణం వారు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం,జంక్ ఫుడ్ అలవాటు పడడం,టీవీ మొబైల్ వంటి బ్లూ స్క్రీన్ కలిగిన ఎక్కువగా చూడటం వల్ల వారి ఇంటి చూపు తగ్గిపోతూ ఉంది.కానీ ఇది ఇలాగే కొనసాగితే మాత్రం పూర్తిగా కంటి చూపుని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.ఇలా కంటి చూపు మందగించిన వారికి సైతం తిరిగి కంటిచూపులు పొందేలా కొన్ని రకాల ఆయుర్వేద సుగుణాలు కలిగిన పదార్థాలు చాలా బాగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మరి అవి ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
చలికాలం వచ్చిందంటే చాలు ఉసిరికాయలు చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి కదా.ఈ ఉసిరికాయలే కంటికి ఔషధమని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.ఈ చిట్కా కోసం అర కేజీ ఉసిరికాయలను తీసుకొని బాగా ఎండబెట్టుకోవాలి.ఇలా ఎండబెట్టిన ఉసిరికాయలను పొడి చేసి,అర స్పూన్ మోతాదులో రోజు తేనెను కానీ,ఆవు నెయ్యిని కానీ జోడించి పరగడుపుని తీసుకోవాలి.ఇలా 45 నుంచి 60 రోజులు వరకు తీసుకోవడంతో కంటి చూపు క్రమంగా మెరుగుపడుతుంది.అంతే కాక ఉసిరికాయలో ఉన్న విటమిన్ సి మరియు విటమిన్ ఏ రోగ నిరోధక శక్తిని పెంచడంతో,దగ్గు,జలుబు,జ్వరం వంటి సీజనల్ రోగాలను దరి చేరకుండా కాపాడుతుంది.
ఉసిరికాయను పోషకాలకు తల్లి వంటిది అని చెబుతూ ఉంటారు కదా.అలాంటి ఉసిరికాయను తరచూ తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలను శుద్ధపరచి ధమనులు,సిరలలోని రక్తం పంపింగ్ చాలా బాగా జరుగుతుంది.దీనితో గుండె ఆరోగ్యం మెరుగుపడి గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.మరియు రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కాకుండా క్రమబద్దీకరించి, మధుమేహం బారిన పడకుండా కూడా కాపాడుతుంది.మరియు జుట్టు ఆరోగ్యానికి మంచి ఔషదమని చెప్పవచ్చు.కావున ప్రతి ఒక్కరూ ఉసిరికాయను ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా ఉత్తమం.మరి ముఖ్యంగా కళ్ళ సమస్యలు ఉన్నవారు అద్భుతమైన చూపు కోసం,కచ్చితంగా ఈ చిట్కా పాటించి చూడండి.