రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి నెల బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే రేషన్ కార్డులు ఉన్నప్పటికీ బియ్యం తీసుకోని వారు చాలామంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనర్హులను గుర్తించడం కోసం పలు సర్వేలను నిర్వహిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఒక పని చేయాలని సూచిస్తుంది.
రేషన్ కార్డు దారులకు హెచ్చరిక
ఒకవేళ ఆ పని చేయకపోతే రేషన్ కార్డు రద్దవుతుందని హెచ్చరికలు జారీచేస్తుంది. రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును మిస్ యూజ్ చేయకుండా ఉండడం కోసం ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా రేషన్ పొందుతున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని వెళ్లిన ఆడపిల్లల పేర్లు తొలగించకుండా బియ్యాన్ని పొందుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
రేషన్ కార్డు దారులు తప్పనిసరిగా ఈ పని చెయ్యాలి
ఈ నేపథ్యంలో ప్రతి నెల వందల క్వింటాళ్ళ బియ్యం దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఈ కేవైసీ నమోదు చేసుకోవడానికి ఇప్పటికే చాలాసార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇంకా చాలామంది ఈ కేవైసీ పూర్తి చెయ్యలేదు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
అలా చెయ్యకుంటే రేషన్ కట్
రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని, ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఆరు నెలల తర్వాత వారి కోటా బియ్యం తగ్గుతుందని స్పష్టం చేశారు. అంటే వరుసగా ఆరు నెలల పాటు ఈకేవైసీ చేయించుకోని లబ్ధిదారులు రేషన్ కోల్పోతారని పేర్కొన్నారు. అయితే ఇంకా కొన్ని రేషన్ కేంద్రాలలో ఈకేవైసీ ప్రక్రియ పూర్తికావడం లేదని డీలర్లు చెప్తున్నారు.
అధికారుల హెచ్చరిక, లబ్దిదారుల విజ్ఞప్తి
ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడం ఒక ప్రధాన కారణంగా వారు వెల్లడిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలామంది ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఆధార్ అప్డేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఆధార్ అప్డేషన్, రేషన్ షాప్ లో ఈ కేవైసీ రెండు అప్డేట్ కాకపోవడంతో రేషన్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని కొందరు లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేవైసీ చేయించుకోనివారు రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకాస్త టైం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
































