బ్యాంకుకు వెళ్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకుంటే ఇబ్బందులు తప్పవు

బ్యాంకుకు వెళ్లాలంటేనే చాలా మంది ఎందుకులే అని లైట్ తీసుకుంటారు. అక్కడి సిబ్బంది సరిగ్గా సమాధానాలు చెప్పకపోవడం, తర్వాత రావాలని చెప్పడం వంటివి జనాలకు చికాకు తెప్పిస్తాయి. కానీ కస్టమర్లకు కొన్ని హక్కులు ఉంటాయి. అవి తప్పక తెలుసుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బ్యాంకు అనగానే.. అందరూ ఓ అభిప్రాయానికి వస్తారు.. అక్కడి సిబ్బంది సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు.. వెళ్తే టైమ్ వేస్ట్ అని అనుకుంటారు. చాలా మంది వెళ్లడానికి వెనకాడతారు. బ్యాంకుకు వెళ్లి ఏదైన డౌట్లు అడిగినిప్పుడు కొన్ని సార్లు సిబ్బంది విసుక్కుంటారు. తర్వాత రండి అంటారు.. సరైన సమాధానం చెప్పరు. బ్యాంకులలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎదురూ ఉంటుంది. అయితే బ్యాంకు సిబ్బంది కస్టమర్లతో ఈ విధంగా ప్రవర్తించకూడదు. కస్టమర్ల కోసం ఆర్బీఐ కొన్ని కఠినమైన రూల్స్ రూపొందించింది. బ్యాంక్ ఉద్యోగులు కస్టమర్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది.


అవగాహన లేకపోవడం వల్లే..

కస్టమర్లకు వారి హక్కుల గురించి సమాచారం లేకపోవడమే ఉద్యోగుల నిర్లక్ష్యానికి కారణమవుతుంది. ఒక బ్యాంకు ఉద్యోగి తప్పుగా ప్రవర్తిస్తే, కస్టమర్ నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు సైతం కంప్లైంట్ ఇవ్వొచ్చు. అప్పుడు మీ సమస్య వెంటనే పరిష్కారమవుతుంద. సమస్యను నేరుగా ఆర్బీఐకి దృష్టికి తీసుకెళ్లేముందు.. బ్యాంక్ మేనేజర్ లేదా నోడల్ ఆఫీసర్‌కు ముందు ఫిర్యాదు చేయవచ్చు.

ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

బ్యాంక్ కస్టమర్లు సమస్యల గురించి ఫిర్యాదులను గ్రీవెన్స్ సెల్‌లో నమోదు చేయవచ్చు. దాదాపు ప్రతి బ్యాంకుకు ఫిర్యాదుల పరిష్కార వేదిక ఉంది. ఫిర్యాదులపై తక్షణ చర్య తీసుకుంటారు. మీరు ఏ బ్యాంకు కస్టమర్ అయినా.. మీరు ఆ బ్యాంకు యొక్క కంప్లైంట్ రిడ్రసెల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. దీనితో పాటు టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా బ్యాంకు పోర్టల్‌లో కంప్లైంట్ చేయవచ్చు.

బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌..

మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగిపై బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎటువంటి చర్య తీసుకోకపోతే.. మీరు నేరుగా బ్యాంక్ అంబుడ్స్‌మన్‌కు కంప్లైంట్ చేయవచ్చు. సంబంధిత బ్యాంకు నుండి 30 రోజుల్లోపు మీకు పరిష్కారం లభించకపోతే.. మీరు ఆర్బీఐ సీఎంఎస్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

ఎలా ఫిర్యాదు చేయాలి..?

ఫిర్యాదు దాఖలు చేయడానికి.. మీరు cms.rbi.org.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఇవ్వబడిన ఫైల్ ఎ కంప్లైంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ప్రత్యామ్నాయంగా, మీరు CRPC@rbi.org.in కు ఇమెయిల్ పంపడం ద్వారా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంక్ కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆర్బీఐ టోల్ ఫ్రీ నంబర్ 14448 కు కాల్ చేయవచ్చు. దీనిని సమస్యను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌తో, కస్టమర్లు బ్యాంకింగ్ సేవలలోని లోపాల గురించి మాత్రమే కాకుండా లావాదేవీల జాప్యం, యూపీఐ లావాదేవీ వైఫల్యాలు, రుణ సంబంధిత సమస్యల గురించి కూడా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.