సాధారణంగా ఆఫీస్ లో ఆరు గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రిలీఫ్ కోసం కొందరు ఎంప్లాయీస్ కాఫీ తీసుకుంటారు.
మరికొందరు మాత్రం దానికి దూరంగా ఉంటారు. అది బ్యాడ్ హ్యాబిట్ అని ఫీల్ అయిపోతారు. కానీ నిజానికి కాఫీ తాగడమే ప్రాణాలను కాపాడుతుందని చెప్తుంది తాజా అధ్యయనం. 13ఏళ్లుగా 10000 మంది కంటే ఎక్కువ మందిపై నిర్వహించిన ఈ స్టడీ.. కాఫీ తాగని వారితో పోలిస్తే తాగే వారు జీవించే అవకాశం 60 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. అంటే రోజూ కాఫీ తాగడం వల్ల మరణాల ముప్పు 60 శాతం తగ్గుతుందని వెల్లడించింది.
చలనం లేకుండా గంటల కొద్ది కూర్చోవడం పలు అనారోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయి. కాగా అలాంటి హెల్త్ రిస్క్ నుంచి కాఫీ కాపాడుతుందని తాజా అధ్యయనం వివరిస్తుంది. కాఫీలో కెఫిన్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్.. మంటను తీవ్రతరం చేసే జీర్ణక్రియ సమస్యను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం నుంచి కాపాడుతాయి. అయితే చనిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి శరీరంలో కాఫీ ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ అస్పష్టంగా ఉండగా .. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది. కాగా ఇంతకు ముందు చైనాలోని సూచౌ యూనివర్శిటీ మెడికల్ కాలేజీలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు రోజూ ఆరు గంటలు కూర్చుని కాఫీ తాగని వారితో పోలిస్తే తాగేవారికి 24 శాతం తక్కువ మరణ ప్రమాదం ఉందని కనుగొన్నారు.