బరువు తగ్గడానికి చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు తరచూ పొట్లకాయ తినటం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొట్లకాయలో అనేక రకాల పోషకాలు నిండివున్నాయి.
పొట్లకాయలో పోషకాలు మెండుగా ఉంటాయి. అధికంగా ఫైబర్‌తో పాటు స్వల్పంగా ప్రోటీన్లు, పిండిపదార్థాలు ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, బీ1, బీ2, బీ3, బీ6, బీ9, సితో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్, సోడియం, జింక్ వంటి ఆవశ్యక ఖనిజాలు ఉంటాయి. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి తొడ్పడుతుంది. పొట్లకాయలో చాలా మంచి మొత్తంలో ఫైబర్ ఉంది. ఇది మీకు త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచడానికి పనిచేస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. దీనితో పాటు పొట్లకాయ తక్కువ కేలరీల ఆహారం. ఇది శరీరంలో కొవ్వును పెంచదు. యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉండడం వల్ల కీళ్ల వ్యాధులు సైతం నయం అవుతాయి. ఇది వృద్ధులకు ఎంతగానో మేలు చేసే అంశం. అలాగే ఈ కాయలను తింటే థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగు పడుతుంది.
విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు పొట్లకాలో ఉన్నాయి. ఇవి మన శరీరానికి శక్తిని ఇస్తాయి. పొట్లకాయ డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం అంటున్నారు ఆహార నిపుణులు. ఇందులో యాంటీ డయాబెటిక్ నియంత్రించే లక్షణాలు కనిపిస్తాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాదు.. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పొట్లకాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు డీహైడ్రేషన్‌ను నివారించడంలో పొట్లకాయ ఉఫయోగపడుతుంది. అలాగే కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.
పొట్లకాయలను తరచుగా తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలు ఉండవు. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణాలు పోట్లకాయలో ఉన్నాయి. జ్వరం వచ్చిన వారు, కామెర్లు అయిన వారు ఈ కాయలను తింటుంటే త్వరగా కోలుకుంటారు. అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఈ కాయలు ఎంతో మంచివి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాల్షియం అధికంగా ఉంటుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. పొట్లకాయ తినటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్స్, ఒత్తిడి, డిప్రెషన్ దరిచేరవు. పొట్లకాయలను ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఇలాంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)