ఇవి తింటే త్వరగా ముసలోళ్ళు అయిపోతారు.. ఆ ఆహార పదార్ధాలు ఏంటంటే?

www.mannamweb.com


టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో మనుషుల జీవనశైలి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కారణంగా అతి తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలు రావడం వయసులో ఉన్నప్పుడే ముసలి వాళ్ళలా కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవడం వల్ల మన వయసుకు తగ్గట్టుగా శరీరాన్ని ఎంతో ఫిట్ గా ఉంచుకోవచ్చు. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆలూ చిప్స్, ఆలూ ఫ్రెంచ్ ప్రైస్ చేసే రకరకాల ఫ్రైలను వీలైనంతవరకు వరకు దూరం పెట్టాలి.

వీటిని ఎక్కువగా నూనెలో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. ఇది మన శరీర కణాలకు హాని చేస్తాయి. అంతే కాకుండా వాటిలో ఉప్పు అధికంగా వేస్తారు. దానిని తినడం వల్ల ముసలితనం తొందరగా వచ్చేస్తుంది. అలాగే తరచూ కాఫీలు కూల్ డ్రింక్ లు తాగేవారు వాటిని తగ్గించుకోవాలి. వీటిలో కేఫైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రను దూరం చేసి నిద్రలేని సమస్యకు దారితీస్తుంది. నిద్ర లేకపోతే త్వరగా ముసలితనం వస్తుంది. అలాగే చక్కెరను ఎక్కువగా తినే వారికి ముసలితనం తొందరగా వస్తుంది. అధిక షుగర్ వాడడం వల్ల డయాబెటిస్ లివర్ సమస్యలు వస్తాయి. ఈ షుగర్ కొల్లాజెన్ ని నాశనం చేసే చర్మం ముడతలు పడేలా చేస్తుంది. అలాగే ప్రాసెస్ చేసినా లేదంటే ప్యాక్ చేసి ఉంచిన మాంసాహారానికి దూరంగా ఉండాలి.

మాంసం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఉప్పు అలాగే అనేక పదార్థాలు కలుపుతూ ఉంటారు. అవి బాగా వేడి చేస్తూ ఉంటారు. ఇటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల అవి చర్మంలో తేమను పోగొట్టి ముడతలు వచ్చేలా చేస్తాయి. అలాగే ఆల్కహాల్ వేడి చేస్తుంది. ఇది కణాలు త్వరగా చనిపోయేలా చేస్తుంది. ఆల్కహాల్ కారణంగా చర్మం పాడే ముడతలు వస్తాయి. దాంతో చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపిస్తారు. ముసలితనం ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. వాటిలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మరి ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు చర్మ కణాలను కాపాడి చర్మ సమస్యలను దూరం చేస్తాయి.. అలాగే కూరగాయలు తృణ ధాన్యాలు శరీరంలో వేడిని తగ్గించి త్వరగా ముసలితనం రాకుండా చేస్తాయి. అలాగే పాలకూర, టమాట,సాల్మన్ చేపలు, ఓట్స్ పప్పులు, గింజలు వంటివి ఎక్కువగా తీసుకుంటే ముసలితనం రాదు..