వ్యాపార రంగంలో మార్వాడీలది ఒక ప్రత్యేకమైన స్థానం అని చెప్పవచ్చు. మార్వాడీలు కేవలం భారత దేశంలో మాత్రమే కాదు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా వారి వ్యాపారాల వల్ల సక్సెస్ సాధిస్తున్నారు.
మార్వాడీల సక్సెస్ వెనుక అనేక సూత్రాలు ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది వెయ్యి రోజుల ప్రణాళిక. మార్వాడిలు తమ వ్యాపారంలో అత్యంత ప్రాథమికంగా భావించేది 1000 రోజుల ప్రణాళికా అని చెప్పవచ్చు. అంటే సుమారు మూడు సంవత్సరాల ప్రణాళికతో మార్వాడీలు తమ బిజినెస్ చేస్తారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, పట్టుదలతో తమ బిజినెస్ కొనసాగిస్తారు. ఇలా మూడు సంవత్సరాల పాటు బిజినెస్ కనుక కొనసాగించినట్లయితే అందులో కచ్చితంగా విజయం సాధిస్తామని మార్వాడి సాంప్రదాయం చెబుతోంది. చాలా మంది మార్వాడీలు అనుభవరీత్యా ఈ సూత్రాన్ని తయారు చేశారు. ఇది కేవలం బిజినెస్ కోసం మాత్రమే కాదు మన జీవితంలో ఏదైనా కష్టపడి సాధించాలి అనుకున్నట్లయితే అందుకు టార్గెట్ సమయం వెయ్యి రోజులు కేటాయించాలని మేనేజ్మెంట్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. నిజానికి మార్వాడీలు ఏ బిజినెస్ స్కూల్స్ లో కానీ, ఎంబీఏ గ్రాడ్యుయేషన్లు గానీ చేయలేదు. కేవలం తమ సాంప్రదాయ రీత్యా అనుభవాల రీత్యా పెద్దలు చెప్పిన మాటలనే పాటిస్తూ వ్యాపార రంగంలో నేడు ప్రపంచంలోనే మేటిగా రాణిస్తున్నారు.
అమెరికాలోని వాల్ స్టేట్ నుంచి, హైదరాబాద్లోని బేగంబజార్ వరకు మార్వాడీలు పాటించే సక్సెస్ సీక్రెట్ ఇదే అని చెప్పవచ్చు. వాళ్ల పెద్దల మాటలను బట్టి ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిస్తే ధందా 1000 దిన్ చలే అనే సూత్రంతో మొదలు పెడతారు.
ఈ వెయ్యి రోజులకు కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం..
>> ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించిన ప్రారంభంలోనే సక్సెస్ రాకపోవచ్చు.
>> ఆ వ్యాపారాన్ని మూడు సంవత్సరాలు పాటు అంటే సుమారు 1000 రోజులపాటు ఒక ప్రణాళిక ప్రకారం ఓర్పుతో కష్టపడి కస్టమర్ల విశ్వాసం సంపాదిస్తూ వ్యాపారం చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామని మార్వాడీలు నమ్ముతారు.
>> నిజానికి 1000 రోజులపాటు కేవలం కష్టపడితే సరిపోదు అందుకు తగిన స్మార్ట్ వరకు కూడా చేయాల్సి ఉంటుంది అన్న సంగతి గుర్తుంచుకోవాలి. . ఇలా ఒక గోల్ పెట్టుకొని పని చేసినట్లయితే కచ్చితంగా వ్యాపారంలో రాణిస్తాము.
































