మీకు ఎకరం భూముంటే చాలూ.. నెలకు రూ.2.5లక్షల సంపాదన.. ఎలానో తెలుసా?

టీవలి కాలంలో భారతదేశంలో చాలా మంది రైతులు సాంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటలను పండించేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈ వాణిజ్య పంటల్లో తక్కువ శ్రమతో పాటు ఎక్కువ ఆధాయం కూడా ఉంటుంది.


మీరు కూడా అలాంటి వాణిజ్య పంటలు పండించాలంలే మీకు బ్రోకలీ సాగు మంచి ఎంపిక అవుతుంది. అలాగే దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.. గతంలో మూడు నెలలు మాత్రమే ఆదాయాన్ని అందించే ఈ పంట ఇప్పుడు రైతుల ఆర్థిక శక్తిని పెంచుతోంది.

ఆరోగ్యకరమైన కూరగాయలలో బ్రోకలీ మంచి ప్రజాదరణ పొందుతుంది. దీనికి ఉన్న డిమాండ్‌తో రోజురోజుకూ దీని ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బహిరంగా మార్కెట్లో బ్రోకలీ కిలోకు రూ. 300 నుండి 400 వరకు అమ్ముతున్నారు. అలాగే రైతులు టోకు అమ్మకాలలో కూడా మంచి లాభాలను పొందుతున్నారు. ఈ పంటను సరిగ్గా సాగు చేస్తే, ఎకరానికి రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల నికర లాభం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ బ్రోకలీ పంట విత్తనం వేసిన నాటి నుంచి 90 నుండి 120 రోజుల్లో పంట మన చేతికి వస్తుంది. ఇది ఎక్కువగా చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు దీనిని పెంచడానికి ఉత్తమ సమయం. కర్ణాటక, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ పంటను విజయవంతంగా పండిస్తున్నారు. నాటిన రెండు నెలల తర్వాత ఈ పంట రైతు చేతికి వస్తుంది.

బ్రోకలీ సాగుకు ఎకరానికి రూ. 35,000 నుండి రూ. 45,000 పెట్టుబడి అవసరం. హైబ్రిడ్ విత్తనాలు, పాలీహౌస్‌ల నిర్మాణం, కూరగాయల రవాణాపై ప్రభుత్వం 50% సబ్సిడీని అందిస్తోంది. ఉద్యానవన శాఖ సహాయంతో రైతులు ఈ పథకాల నుండి ప్రయోజనం పొందవచ్చు.

సరైన పోషకాహారం, నీటిపారుదల ఉంటే, ఈ పంట మంచి దిగుబడిని ఇస్తుంది. ఎకరానికి సగటున 6-8 టన్నుల దిగుబడి లభిస్తుంది. ఈ విధంగా, తక్కువ విస్తీర్ణంలో అధిక లాభాలను ఇచ్చే బ్రోకలీ నేడు రైతులకు లాభదాయకమైన పంట.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.