150 రూపాయల పెట్టుబడి…లక్ష ఆదాయం…ఎదో కొత్త క్రిప్టో కరెన్సీ గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? కానీ కాదు… మరి అసలు 150 పెట్టుబడితో ఎవరైనా ఒక లక్ష సంపాదించగలరా?
అని సీరియస్ అయిపోవద్దు. సాధ్యమే. అది కూడా చట్టబద్ధంగా… 150 రూపాయలతో ఒక మొక్క నాటితే మీకు 10 ఇళ్లల్లో డబ్బు కాస్తుంది..బాగుంది కదా. అలాగని ఇది ఎర్రచందం చెట్ల పెంపకం ఏమీ కాదు. ఇంట్రస్టింగ్ బిజినెస్ ఫార్మింగ్ గురించి తెలుసుకోండి…..
పెట్టుబడి అంటే ఎలా ఉండాలంటే ఖచ్చితంగా రిటర్న్స్ ఇవ్వాలి. అదే పెట్టుబడి. రిస్కుల భయంతో చేసేది వ్యాపారం కాదు..రిస్క్ లేకుండా డబ్బు సంపాదించాలంటే ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. పోనీ వ్యవసాయం చేద్దామా అంటే అదేమో పెద్దగా లాభాలు ఇవ్వదు. అందుకే చాలా వరకు చిన్న కమతాలు ఉండేవారు అవి వదిలిపెట్టి ఎక్కడో ఒకచోట ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు..అయితే ఇప్పుడు మేము చెప్పే ఈ ప్లాన్ తో లక్షల్లో సంపాదించడం చాలా ఈజీ. అదే మహోగని ఫార్మింగ్. పేరులానే ఇది డబ్బుల గని లాంటి చెట్టు. రేటు ఒక మొక్క మీకు 150 నుండి దొరుకుతుంది. దీనిని ఒకసారి నాటి వదిలిపెడితే చాలు అదే పెరుగుతుంది. దీనిని ఒకసారి నాటేప్పుడు కొంచెం ఎరువు ఖర్చు తప్ప ఏమి అదనపు ఖర్చు అంటూ పెద్దగా ఉండదు. ఇది అడివి చెట్టు. పెద్దగా మెయింటెనెన్సు ఉండదు. పెద్దగా నీటి అవసరం ఉండదు. ఈ చెట్టుకున్న స్పెషల్ ఏంటంటే దీని పళ్లకు కూడా డిమాండ్ ఉంది. ఆయుర్వేదం మందుల్లో వాడతారు.
ఇది వెంటనే చేతికి వచ్చే పంట కాదు కాబట్టి వేరే ఆదాయ మార్గాలున్నవారు ఒక ఎకరం భూమిలో ఈ మొక్కలు నాటితే 10 సంవత్సరాల తరువాత లాభం కోటి రూపాయలవరకు వచ్చే అవకాశం ఉంది. చీడపీడల భయం లేదు. ఎకరానికి 400 మొక్కలు వెయ్యవచ్చు. ఈ చెట్లనుండి వచ్చే చెక్క నాణ్యత చాలా ఎక్కువ. ఈ కలప షిప్పులు, బోట్ల తయారీలో, ఫర్నిచర్ తయారీలో వాడతారు. దీనికి టేకుకంటే డిమాండ్ ఎక్కువ. మంచి సాయిల్ లేకున్నా ఈ మొక్క పెరుగుతుంది. ఎర్ర నేలలకు, ఇసుకనేలల్లో కూడా వెయ్యవచ్చు. పెద్దగా ఎరువులు వేసే అవసరం లేదు. ఒక్కసారి వేసి మర్చిపోవడమే.
ఫార్మింగ్ చేసే విధానం:
ఇక సాగు ఎలా మొదలుపెట్టాలంటే మనం భూమిని ఒకసారి దుక్కి దున్ని సిద్ధం చేసి దగ్గరలో ఉన్న నర్సరీ నుండి మొక్కలు కొని తెచ్చి నాటడమే..గుంత తవ్వి కొంచెం ఎరువు వేసి మొక్కను నాటి నీరుపెడితే అయిపోయింది. ఇక డ్రిప్ సిస్టం తో నీరు అందేలా ఏర్పాటు చేసుకోవడమే. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం చీడపీడల ఇబ్బంది ఉండవచ్చు. అది కూడా చాలా తక్కువ. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది కాంట్రాక్టు ఫార్మింగ్ పద్దతిలో అనేక కంపెనీలు చేపడుతున్నాయి. ఆన్లైన్ లో వెతికితే మీకు అలాంటి కంపెనీలు దొరుకుతాయి. వాళ్ళను కాంటాక్ట్ చేస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు..మీ దగ్గర ఎకరం భూమి లేదా అర ఎకరం ఉన్నా చాలు. పెట్టుబడి మొత్తం వారే చూసుకుని పెద్దయ్యాక కలప కొట్టటం, కొనడం, మార్కెటింగ్ చివరికి మీకు ప్రాఫిట్ ఇవ్వటం ఇలా అగ్రిమెంట్స్ చేసుకుంటారు. అదే మీరు సొంతం గా చేపట్టినట్లయితే మొత్తం ప్రాఫిట్ మీకే వస్తుంది. కాకపోతే ఈ చెట్టు కొట్టాలంటే అటవీ శాఖ అనుమతి అవసరం ఉంటుంది. అది తీసుకోవాలి. ఈ చెట్ల వాళ్ళ ఆక్సిజన్ శాతం పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వీటికి కొంత మొత్తం చెల్లిస్తుంది. దానికి కార్బన్ క్రెడిట్స్ అంటారు. అది మీకు అదనపు ఆదాయం. ఒక అంచనా ప్రకారం ఎకరానికి కోటి రూపాయలవరకు ఆదాయం వస్తుందని అంచనా. తక్కువలో తక్కువ 70 లక్షలకు అయితే తగ్గదు.
మీకోసం డీటెయిల్ బ్రేక్ అప్
మొక్కలు ఖర్చు: 400 * 150 = 60000
డ్రిప్ సిస్టం : 20000
నాటడడానికే అయ్యే ఖర్చులు : 10000
ఎరువులు & మెయింటెనెన్స్ మొదటి 2 సంవత్సరాలకు 5,000 . ఎకరానికి ఒక 95000 రూపాయల ఖర్చు వస్తుంది. అయితే అర్హత ఉన్న చిన్న రైతులకు డ్రిప్ సిస్టం పై సబ్సిడీ లభిస్తుంది. ఇది కేవలం అంచనా ఖర్చు మాత్రమే. వాస్తవం లో ఎక్కువ తక్కువలుండవచు.
ఇదీ మొత్తం ప్లాన్. అదిరిపోయింది కదా… ఇంకెందుకు ఆలస్యం డబ్బుల గని తవ్వటం మొదలు పెట్టండి. మహోగని ఫార్మింగ్ మొదలుపెట్టండి…
DISCLAIMER : ఈ బిజినెస్ ఐడియా కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో ఇచ్చిన పెట్టుబడి వివరాలు కేవలం అంచనా మాత్రమే. వాస్తవం లో వాటి ధరల్లో ఎక్కువ తక్కువ మార్పులు ఉండవచ్చు. ఇది వ్యాపారానికి ఇచ్చే సలహా కాదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు మీ ఫైనాన్సియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి
































