సామాన్యుడి కోసం SBI సూపర్ స్కీమ్.. నెలకు 100, 500, 1000 పెట్టుబడి పెడితే.. 5 సంవత్సరాలలో ఎంత వస్తుంది?

రోజు వారీ కూలీలు, భవన నిర్మాణ కూలీలు రోజంతా కష్టపడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. అలాంటి వారు పెట్టుబడులు పెట్టడం అనేది దాదాపు సాధ్య కాదనే చెప్పాలి.


దీంతో రోజు రోజు వచ్చే కూలీ డబ్బుల నుంచి కొంత కొంత పక్కనబెడుతూ పొగు చేస్తుంటారు. అయితే ఇంట్లో డబ్బులు దాయడం వల్ల ఆందోళన ఉంటుంది. అలాంటి వారందరి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అద్భుతమైన పథకం అందిస్తోంది. నెల నెలా చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు దాచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. పొదుపు ఖాతాతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లు అందిస్తోంది. ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ పథకం (SBI Recurring Deposit Scheme). మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడే తెలుసుకుని మీరూ పొదుపు ప్రారంభించండి. నిర్ణీత కాలానికి గానూ నెల నెలా పొదుపు చేసుకునే అవకాశాన్ని ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కల్పిస్తుంది. తమ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సాయపడుతుంది. ఇందులో కనీస టెన్యూర్ 12 నెలలుగా ఉండగా గరిష్ఠంగా 120 నెలలు అంటే 5 సంవత్సరాల పాటు పొదుపు చేయవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని ఎస్‌బీఐ బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో నెలవారీ కనీస డిపాజిట్ రూ.100గా నిర్ణయించారు. ఆ తర్వాత ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. అయితే, ఇచ్చిన గడువులోపు డిపాజిట్ చేయకపోతే కొంత పెనాల్టీ పడుతుంది. అలాగే వరుసగా ఆరు నెలల పాటు ఎలాంటి డిపాజిట్లు చేయకపోతే అకౌంట్ క్లోజ్ చేస్తారు. ఖాతాదారుడికి బ్యాలెన్స్ చెల్లిస్తారు.

నెలకు రూ.100, 500, 1000 కడితే ఎంతొస్తుంది?

ఎస్‌బీఐ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో ఒక వ్యక్తి నెలకు రూ.100 లేదా రూ.500 లేదా రూ.1000 చొప్పున పొదుపు ప్రారంభించాడు అనుకుందాం. 5 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకుంటే అప్పుడు సదరు వ్యక్తికి వడ్డీ రేటు 6.50 శాతం వర్తిస్తుంది. అయితే, 5 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అనేది ఆన్‌లైన్ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. నెలకు రూ.100 చొప్పున జమ చేసుకుంటూ వెళ్తే 5 ఏళ్లకు మీ డిపాజిట్ అమౌంట్ రూ.6 వేలు అవుతుంది. దానిపై వడ్డీ రూ.1,106 కలిపి మొత్తం రూ.7,106 వస్తాయి. అదే నెలకు రూ.500 జమ చేసుకుంటూ వెళ్లాడు అనుకుందాం. అప్పుడు 5 సంవత్సరాలకు మొత్తం డిపాజిట్ అమౌంట్ రూ.30 వేల అవుతుంది. దీనిపై వడ్డీ రూ.5,528 అందుతుంది. మొత్తంగా చేతికి రూ. 35,528 వరకు వస్తాయి. ఇక నెలకు రూ.1000 చొప్పున జమ చేస్తే డిపాజిట్ అమౌంట్ రూ. 60 వేలు అవుతుంది. దానిపై అతనికి వడ్డీ రూ.11,057 వస్తుంది. మొత్తంగా చేతికి రూ.71,057 వరకు అందుతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.