40 లక్షలు ఎలా?: మీరు నెలకు రూ.12,500 చొప్పున పెట్టుబడి పెడితే.. 15 ఏళ్లలో మొత్తం పెట్టుబడి సుమారు రూ.22.5 లక్షలు అవుతుంది. మీరు రూ.18 లక్షలకు పైగా వడ్డీని పొందుతారు.15 సంవత్సరాల తర్వాత మీరు సుమారు రూ.40.68 లక్షలను అందుకుంటారు.
ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్: PPF పథకం యొక్క అతిపెద్ద ఆకర్షణ దాని పన్ను ప్రయోజనం. ఇది మూడు రెట్లు పన్ను మినహాయింపును అందిస్తుంది. డిపాజిట్ మొత్తానికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.వడ్డీపై ఎటువంటి పన్ను ఉండదు.15 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం ఆదాయంపై కూడా పన్ను లేదు.
స్థిరమైన రాబడి: ఈ పథకానికి భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుంది..కాబట్టి పెట్టుబడిదారులు తమ డబ్బును కోల్పోతారనే భయం ఉండదు. స్టాక్ మార్కెట్ వంటి రిస్క్‌తో కూడిన వాటితో పోలిస్తే, రిస్క్ లేకుండా స్థిరమైన, నమ్మదగిన రాబడిని కోరుకునే వారికి ఇది సరైన మార్గం.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కేవలం రూ.500 మాత్రమే అవసరం. కాబట్టి తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా సులభంగా పొదుపు చేయవచ్చు. ఈ పథకం 15 సంవత్సరాల కాలానికి అందుబాటులో ఉంటుంది. ఈ 15 సంవత్సరాల తర్వాత దీనిని 5 సంవత్సరాల చొప్పున పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.
లోన్ సౌకర్యం: దీర్ఘకాలిక పెట్టుబడి అయినప్పటికీ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని PPF కొన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. పెట్టుబడిదారులు తమ PPF ఖాతా నిధులపై లోన్స్ కూడా తీసుకోవచ్చు. అత్యవసరమైతే మొదటి ఐదు సంవత్సరాల తర్వాత పాక్షికంగా డబ్బును ఉపసంహరించుకోవడానికి కూడా అనుమతి ఉంది.

































