జీవితం సంతోషంగా సాగాలంటే, ఎలాంటి ఇబ్బందులనైనా తట్టుకోవాలంటే ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరం. ఆదాయం సంపాదించడం, పొదుపు చేయడం, ఆ పొదుపును పెట్టుబడిగా పెట్టి అదనపు రాబడికి పెంచుకోవడం చాలా ముఖ్యం.
దీనికోసమే ప్రతి ఒక్కరూ వివిధ మార్గాలలో పెట్టుబడి పెడతారు. లాభదాయకమైన వాటి కోసం ఎదురు చూస్తారు. ఈ పెట్టుబడి మార్గాలలో కూడా అధిక ప్రయోజనం కలిగించే వాటిని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయపు పన్ను ఆదా చేసే అవకాశం ఉన్న వాటిపై ఆసక్తి చూపుతారు. వీటిలో ఫిక్స్ డ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ముఖ్యమైనవి. వీటిలో ఏ పథకం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది, రాబడి ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం.
స్పష్టత అవసరం
పన్ను ఆదా చేసే ఎఫ్ డీలు, ఈఎల్ఎస్ఎస్ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఈ రెండు మార్గాలు చాలా ప్రాచుర్య పొందాయి. ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా స్థిరమైన రాబడిని కోరుకునే వారికి ఎఫ్ లు ఉపయోగంగా ఉంటాయి. కొంచె రిస్క్ అయినా అధిక రాబడి పొందటానికి ఈఎల్ఎస్ఎస్ అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు పథకాల మధ్య కొన్ని సారూప్యతలు, భేదాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే దేనిలో పెట్టుబడి పెట్టాలోనే విషయంపై స్పష్టత వస్తుంది.
ఆదాయపు పన్నులోని సెక్షన్ 80 సీ ప్రకారం ఎఫ్ డీలు, ఈఎల్ సీసీ లో పెట్టుబడికి మినహాయింపు లభిస్తుంది. రూ.1.5 లక్షలకు వరకూ వర్తిస్తుంది.
ఈఎల్ఎస్ఎస్ లో లాక్ ఇన్ పిరియడ్ మూడేళ్లు మాత్రమే ఉంటుంది. పన్ను ఆదా చేసే ఎఫ్ డీలకు ఐదేళ్ల వరకూ వేచి ఉండాలి.
ఈఎల్ఎస్ఎస్ అంతా స్టార్ మార్కెట్ పై ఆధారపడుతుంది. మార్కెట్ లింక్డ్ రిటర్న్ లను అందిస్తుంది. వీటి వల్ల ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది.
ఫిక్స్ డ్ డిపాజిట్ స్థిరమైన రాబడిని అందిస్తుంది. ఈ రేటు బ్యాంకు ద్వారా నిర్ణయిస్తారు. మార్కెట్ రిస్క్ తో సంబంధం ఉండదు. పెట్టుబడి దారులకు నష్టం కలగదు.
మూడేళ్ల తర్వాత ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల వరకూ ఈఎల్ఎస్ఎస్ లాభాలపై పన్ను ఉండదు. అంతకంటే ఎక్కువ ధీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం ఎల్ టీసీజీ పన్ను కట్టాలి.
పన్ను ఆదా చేసే ఎఫ్ డీ నుంచి వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలో ఉంటుంది. దానిపై పెట్టుబడిదారుడి పన్ను శ్లాట్ ప్రకారం ఆదాయపు పన్ను విధిస్తారు.
క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ (డైరెక్ట్) 37.61 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ (డైరెక్ట్) 28.63 శాతం
ఎస్ బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ (డైరెక్ట్) 27.87 శాతం.
మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ (డైరెక్ట్) 26.69 శాతం
పరాగ్ ఫారిఖ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ (డైరెక్ట్) 26.47 శాతం
ఫిక్స్ డ్ డిపాజిట్ల నుంచి రాబడి (ఐదేళ్లలో)
ఎస్ బీఎం బ్యాంక్ ఇండియా 7.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం
ఎస్ బ్యాంకులో 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం
డీసీబీ బ్యాంకులో 7.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం.
ఇండస్ ఇండ్ బ్యాంక్ లో 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు రూ.7.75 శాతం
ఆర్ బీఎల్ బ్యాంక్ 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం.