హైదరాబాదులో కేవలం 50 లక్షల రూపాయలకే ఇండిపెండెంట్ ఇల్లు ఎక్కడో తెలిస్తే ఆనందంతో ఊగిపోతారు…

హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు అపార్ట్ మెంట్ ప్లాట్స్ ధరలు, విల్లాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.


వీటిలో ప్రధానంగా ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో తక్కువ బడ్జెట్లో ఇళ్లను కొనుగోలు చేయాలంటే అసలు దాదాపు అసాధ్యమైన పరిస్థితికి చేరుకుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లోని పశ్చిమ ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో అతి తక్కువ ధరలకే ఇండిపెండెంట్ ఇల్లు కొనుగోలు చేయాలి అంటే ఎలా అని ఆలోచిస్తున్నారా. ? హైదరాబాద్ నగరంలోని . తూర్పు ప్రాంతంలో ఇంకా ధరలు తక్కువలోనే ఉన్నాయి. ముఖ్యంగా షామీర్ పేట్ ప్రాంతంలో హైదరాబాదులోని మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే ధరలు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడిప్పుడే కాలనీలు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి. వీటిలో గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్ నగరం నాలుగువైపులా విస్తరిస్తున్న నేపథ్యంలో, త్వరలోనే ఈ గేటెడ్ కమ్యూనిటీలు కాలనీలో హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా షామీర్ పేట్ పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు తురకపల్లి, లాల్‌గాడిమలక్‌పేట్, అలియాబాద్, మజీద్‌పూర్, షామీర్‌పేట్, మందయపల్లి, పోతయపల్లి, దేవరయంజాల్, తూంకుంట, అంతయపల్లి, బొమ్మరాస్‌పేట్ ఇలాంటి గ్రామాల పరిధిలో కొత్తగా కాలనీలు వెలుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో 100 గజాల నుంచి 150 గజాల విస్తీర్ణంలో నిర్మించే ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు 50 లక్షల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ఫార్మా రంగం భారీగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. కనుక భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు కొనుగోలు చేసిన ఆస్తి విలువ భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్స్ ధరలు కూడా తక్కువలోనే ఉన్నాయి. ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే కాస్త అందుబాటులో ఉన్నాయి అని చెప్పవచ్చు.

Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు  పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.