Health tips | ఇవి తెలిస్తే మీరు బ్రౌన్‌ షుగర్‌ను వాడకుండా అస్సలు ఉండలేరు..!

www.mannamweb.com


Health tips | ఇవి తెలిస్తే మీరు బ్రౌన్‌ షుగర్‌ను వాడకుండా అస్సలు ఉండలేరు..!

Health tips : బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు సర్వసాధారణమయ్యాయి. దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉండాలన్నా.. ఇప్పటికే అలాంటి అరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

వైద్యులు చెప్పినట్లే రోగులు కూడా అవసరమైన జాగ్రత్తలు పాటిస్తుంటారు. తాజాగా వైద్యులు బ్రౌన్ షుగర్‌ కూడా ఆరోగ్యానికి మంచిదని రిఫర్ చేస్తున్నారు. బ్రౌన్‌ షుగర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దాం..

ప్రయోజనాలు..

1. బ్రౌన్ షుగర్‌ను చెరుకు నుంచి కాకుండా నేరుగా బెల్లం నుంచి సేకరిస్తారు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్‏లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, వైట్ షుగర్ తీసుకోవడంవల్ల కేలరీలు పెరుగుతాయి. దానివల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

2. బ్రౌన్ షుగర్‌తో జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. దాంతో మలబద్దకం సమస్య కూడా తీరిపోతుంది. అందుకోసం రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం ముక్క, ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలిపి తీసుకోవాలి.

3. అదేవిధంగా శరీరంలో తిమ్మిర్లను తగ్గించడానికి కూడా బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కాళ్లు, చేతుల్లో తిమ్మిరితోపాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

4. బ్రౌన్ షుగర్‌లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే జీవక్రియలను మెరుగుపరుస్తుంది. బ్రౌన్ షుగర్‌లో విటమిన్ బి6, నియాసిన్, పాంతోటెనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా విరివిగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్‏గా పనిచేస్తాయి. చర్మంపై మృత కణాలను తొలగించే స్క్రబ్‏గా పనిచేస్తాయి.

5. బ్రౌన్ షుగర్ యాంటీ అలర్జీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఇది ఉబ్బసం రోగులకు చేసే చికిత్సలో సాయపడుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా బ్రౌన్‌ షుగర్‌ కలిగి ఉంటుంది.