ఈ పొడిని వేడి నీటిలో కలిపి తాగితే.. మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాల్సిందే

చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి హానికరం. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది శరీరంలోని అన్ని ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, అది సిరల్లో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.


ధమనులను అడ్డుకుంటుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా చెడు కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను పరిష్కరించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

శుద్ధి చేసిన నూనె, పామాయిల్, ఇతర సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సోంపు-జీలకర్ర నీరు అద్బుతమైన ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మెంతులు, సోంపు, జీలకర్ర, కొత్తిమీర గింజలు వంటివి ఇతర ఆయుర్వేద మూలికలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పదార్థాలతో కలిపి తయారు చేసిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

తయారీ విధానం : మెంతులు, పచ్చి సోంపు గింజలు, జీలకర్ర, ధనియాలు ఒక్కొక్కటి 2 టీస్పూన్లు తీసుకొని ఒక గిన్నె లేదా పాన్‌లో కాస్త వేయించుకోవాలి.. తరువాత, ఒక ముక్క దాల్చిన చెక్క వేసి, ప్రతిదీ 5-10 నిమిషాలు వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం త్రాగాలి. క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే, త్వరలోనే మీరు ఆశించిన ఫలితం చూస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.