రైల్వేలో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే మీకే ఛాన్స్

క్షిణమధ్య రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో గ్రూప్-సి, గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.


అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 19.

పోస్టుల సంఖ్య: 12

పోస్టులు: గ్రూప్-సి 02, గ్రూప్-డి 10.

ఎలిజిబిలిటీ: గ్రూప్-సి పోస్టుకు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతి లేదా టెక్నికల్ విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రూప్-డి పోస్టులకు పదో తరగతి లేదా ఐటీఐ లేదా ఎన్ఏసీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 33 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 20.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, పీడబ్ల్యూడీఎస్, మహిళలు, మైనార్టీలు, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.500.

లాస్ట్ డేట్: అక్టోబర్ 19.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కౌట్స్ అండ్ గైడ్స్ క్వాలిఫికేషన్ అసెస్​మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు iroams.com వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.