నిందితుడి వద్ద నుండి సుమారు రూ. 24,000 విలువైన ఇంజక్షన్లు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతన్ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ గఫార్ ఖాన్, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. బర్కాస్ ప్రాంతానికి చెందిన అహ్మద్ నాది అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు ఈ ఇంజక్షన్లను కొనుగోలు చేసి, తన నివాసం సమీపంలోని జహనుమా, ఫలక్ నుమా పరిసరాల్లో యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ముఖ్యంగా కండరాలు త్వరగా పెరగాలని కోరుకునే యువతను ఇతను లక్ష్యంగా చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్, ఫలక్ నుమా పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకొని, అతని వద్ద నుండి సుమారు రూ. 24,000 విలువైన ఇంజక్షన్లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఫలక్ నుమా పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 47/2026, సెక్షన్స్ 318(4), 278, r/w 3(5) BNS కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అహ్మద్ నాది ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
మెఫెంటెర్మైన్ సల్ఫేట్ వాడితే ఏం జరుగుతుంది
మెఫెంటెర్మైన్ సల్ఫేట్ అనేది ‘షెడ్యూల్ హెచ్’ (Schedule H) డ్రగ్. దీనిని కేవలం గుర్తింపు పొందిన వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలి. డాక్టర్ సలహా లేకుండా వీటిని వాడటం వల్ల గుండెపోటు (Cardiac Arrest), అధిక రక్తపోటు (High BP) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పోలీసులు హెచ్చరించారు. కాబట్టి జనాలు ఎవ్వరూ డాక్టర్ డి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి ఇంజక్షన్లను వాడకూడదను కోరుతున్నారు.



































