Monsoon Train Journeys: వర్షాకాలంలో చిల్ అవ్వాలంటే ఆ రూట్స్‌లో ప్రయాణం మస్ట్.. టాప్ ఫైవ్ ఇవే మరి

www.mannamweb.com


భారతదేశంలో చవకైన ప్రయాణ సాధనంగా రైలు ప్రయాణాలు మారాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే సౌకర్యవంతమైన ప్రయాణమంటే ముందుగా గుర్తుకు వచ్చేది రైలు ప్రయాణమే.

అయితే ఆహ్లాదకర రైలు ప్రయాణం అంటే వర్షాకాలంలోనే చేయాలి. భారతదేశంలో పర్వతాలు, సరస్సులు, జలపాతాలు, సముద్రాలు, నదుల గుండా అనేక రైల్వే మార్గాలు ఉన్నాయి. ఆయా మార్గాల్లో కరెక్ట్‌గా వర్షాకాలంలో ప్రయాణిస్తే ప్రకృతి రమణీయతను ఎంతగానో ఆశ్వాదించవచ్చు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ప్రయాణించడానికి అనువుగా ఉండే టాప్-5 రైలు మార్గాల గురించి వివరాలను తెలుసుకుందాం.

కల్కా-సిమ్లా

దేశంలోని అత్యంత అందమైన, మనోహరమైన రైలు మార్గాల విషయానికి వస్తే చాలా మంది కల్కా-సిమ్లా రైలు మార్గం పేరును మొదట చెబుతూ ఉంటారు. ఈ రైలు మార్గం హిమాచల్ రాజధాని సిమ్లా నుండి కల్కాను కలుపుతుంది. ఈ రైలు మార్గాన్ని టాయ్ ట్రైన్ అంటారు . సుమారు 96 కి.మీ కల్కా-సిమ్లా రైలు మార్గంలో ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. ఈ మార్గంలో రైలు సొరంగాల గుండా కూడా వెళుతుంది. వర్షాకాలంలో ఈ మార్గంలో ప్రయాణిస్తే వచ్చే అనుభూతి వేరు. అలాగే చలి కాలంలో ఈ రైలు ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

బెంగళూరు-గోవా

వర్షాకాలంలో బెంగళూరు-గోవా రైలు ప్రయాణం కూడా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకంటుంది. బెంగళూరు-గోవా రైలు మార్గం దాదాపు 500 కి.మీగా ఉంది. ఈ రైలు మార్గంలో పర్వతాలు, నదులు, ఎత్తైన వంతెనల గుండా వెళుతున్నప్పుడు మన ఆనందం వేరే లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలు ఈ రైలు ప్రయాణాన్ని అమితంగా ఇష్టపడతారు.

భువనేశ్వర్-బెర్హంపూర్

జగన్నాథ రథయాత్రకు వెళ్లాలను కునే భువనేశ్వర్-బ్రహ్మాపూర్ మార్గంలో రైలులో ప్రయాణించాల్సి ఉంటుంది. భువనేశ్వర్-బ్రహ్మాపూర్ రైలు ప్రయాణం విభిన్న ప్రపంచాన్ని అందిస్తుంది. ఈ మార్గం తూర్పు కనుమల గుండా ప్రసిద్ధ చిల్కా సరస్సు మీదుగా ప్రయాణిస్తాం. చిల్కా సరస్సు అందాలు మనల్ని కట్టి పడేస్తాయి.

జల్పైగురి-డార్జిలింగ్

హిల్ స్టేషన్స్ రైలు ప్రయాణం అంటే మొదటగా గుర్తుకు వచ్చేది డార్జిలింగ్ రైలు మార్గం. డార్జిలింగ్- జల్పైగురి మధ్య టాయ్ ట్రైన్ మీదుగా వెళ్తుగా ప్రకృతి అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఈ ప్రయాణంలో, సరస్సులు, లపాతాలతో పాటు తేయాకు తోటలను చూడవచ్చు.

మండపం-రామేశ్వరం

మండపం-రామేశ్వరం రైలు మార్గం ప్రపంచంలోనే అత్యంత అందమైన రైలు ప్రయాణాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ మార్గం రామేశ్వరాన్ని తమిళనాడులోని మండపం నగరానికి కలుపుతుంది. మండపం-రామేశ్వరం రైలు మార్గం దేశంలోనే రెండవ అతి పొడవైన వంతెన అయిన పాంబన్ వంతెన గుండా వెళుతుంది.