జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..! ఎలా తీసుకోవాలంటే

ఈ రోజుల్లో చాలా మందిలో జుట్టు సమస్యలు అనేది సాధారణ హెల్త్ ప్రాబ్లమ్‌గా మారింది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, జుట్టు రాలిపోయి బట్టతల రావటం వంటి సమస్యలు ఎక్కువ మందిని వేధిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడం తగ్గట్లేదు సరికదా, పెరగడం అసలే లేకుండా పోతోంది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారా..? అయితే, మీకో అద్బుత డ్రింక్‌ వచ్చేసింది. ఇది మీ జుట్టు రాలడాన్ని తగ్గించి రాలిపోయిన జుట్టు డబుల్‌ అయ్యేలా చేస్తుంది. ఆ అద్బుత డ్రింక్‌ ఏంటో ఇక్కడ చూద్దాం..

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉసిరి, అల్లం ముక్క, కరివేపాకు, బెల్లం, నల్ల మిరియాలు ఉంటే చాలు. మీ జుట్టు ఒత్తుగా, ఊడిన జుట్టుకంటే డబుల్‌ పెరుగుతుంది. దీనికోసం ముందుగా రెండు ఉసిరికాయలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం తొక్క తీసి అందులో వేయండి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. రుచికోసం కొద్దిగా బెల్లం, 2 నల్ల మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇందులో కొన్ని నీళ్లు పోసి మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయండి. దీనిని వడబోసి రసం ఓ గ్లాసులోకి తీసుకోండి. అంతే రుచి కోసం చూడకుండా మింగేయడమే.


ఉసిరి, అల్లం, కరివేపాకు జుట్టుతో పాటు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లు, చర్మా్న్ని లోతు నుంచి శుభ్రం చేస్తాయి. తద్వారా వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. అంతేకాదు.. తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు, జుట్టు వయసు పెరగకుండా ఉండాలనుకునే వారు రోజూ ఈ జ్యూస్ తాగడం మంచిది. మూడు వారాలు ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.

క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌ తీసుకోవటం వల్ల మీ జుట్టు కుదుళ్లను లోతు నుంచి శుభ్రం చేసి దుమ్ము, ధూళిని తొలగించడంలో ఈ జ్యూస్ సహాయపడుతుంది. తద్వారా చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. అల్లంలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనిని ఉసిరి, కరివేపాకుతో కలిపి తీసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.