ఒకే కుటుంబంలో.. ఒకేసారి 17 మందికి పెళ్లి.. ఒకే శుభలేక

www.mannamweb.com


ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే.. ఈ రెండు ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి, అలాగే కష్టంతరమైనదని చెప్పవచ్చు. సాధారణంగా ఇప్పుడున్న రోజుల్లో ఒకరికి సంబంధం చూసి, పెళ్లి చేయడమే ఏదో పెద్ద బాధ్యతగా భారంగా అనిపిస్తుంటుంది. నిజం చెప్పాలంటే ఈరోజుల్లో పెళ్లిళ్లు చేయాలంటే.. కట్న కానుకుల దగ్గర నుంచి వివాహ వేదిక వరకు, విందు భోజనాలు, ఫోటోలు, వీడియోలు ఇలా చెప్పుకుంటు పోతే ప్రతిది బోలెడంత ఖర్చుతో కూడుకున్న విషయం. మరి, అలాంటి పెళ్లిళ్లు ఇంట్లో ఒకరి, ఇద్దరికి చేసినప్పుడు ఉన్నది సరిపోకా, అప్పులు చేసి.. నానా తంటాలు పడుతూ శుభకార్యలను చేస్తుంటారు. అప్పటికే కన్నవారికి చుక్కలు కనిపిస్తుంటాయి. కానీ, తాజాగా ఓ కుటుంబంలో మాత్రం ఒకేసారి 17 మందికి వివాహాలు జరిపించారు. అదేమిటి ఒకే ఇంట్లో ఒకోసారి 17 మందికి పెళ్లి చేశారా అని వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజంగానే జరిగింది. ఇంతకి ఎక్కడంటే..

సాధారణంగా ప్రస్తుత కాలంలో ఒకరికి సంబంధం చూసి పెళ్లిళ్లు చేయడామే పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా .. ఇంట్లో ఉన్న ఆడపిల్లకు పెళ్లి చేసి ఇళ్లు దేటించాలంటే.. అంతా చిన్న మాట ఏమీ కాదు. ఎందకంటే.. సంబంధం కాయం అయిన నుంచి పెళ్లి చేసి ఇళ్లు దేటించిన వరకు ప్రతిది లక్షల ఖర్చుతో ముడిపడిన విషయమని అందరికి తెలిసిందే. అలాంటి తాజాగా ఓ ఇంట్లో ఒకేసారి 17మందికి పెళ్లి చేసి అందరి చేత ఔరా అనేలా చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన సూర్జారామ్‌ గోదారా అనే వ్యక్తి .. తన ఇంట్లో ఉన్న మనవాళ్లు, మనుమరాళ్లు ఇలా మొత్తం 17 మందికి ఒకేసారి వివాహాలు జరిపించారు. పైగా వీరందరి వివాహాలకు ఒకే శుభలేఖలో ముద్రించి, బంధుమిత్రులను ఆహ్వానించారు. అయితే గోదరా కు చెందిన 5 మనుమలకు ఏప్రిల్‌ 1న వివాహం చేయగా.. మిగిలిన 12 మంది మనుమరాళ్లకు ఆ మర్నాడు పెళ్లిళ్లు చేశారు. అయితే ఇలా బికనీర్‌ జిల్లా, నోఖా మండలం, లాల్‌మదేసర్‌ గ్రామంలో.. ఒకే ఇంట్లో ఇలా సామూహిక వివాహాలు జరగడంతో అందరూ ఈ పెళ్లిలను చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాగే మునపెన్నడూ ఇలాంటి వివాహాలు ఎక్కడ చూడటం, వినడం వంటివి జరగలేదని.. మొట్ట మొదటిసారి ఇలా ఒకే ఇంట్లో ఇంత మందికి పెళ్లిళ్లు జరగడమని చర్చించుకుంటున్నారు.