దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబమది. బిడ్డలిద్దర్నీ తల్లిదండ్రులు ఒకేలా పెంచారు. అయితే చిన్నోడు అని చెప్పి అతడ్ని మరింత గారాబం చేశారు. తల్లి చాటు బిడ్డ కావడంతో ఆస్తి పంపకాల్లో చిన్నోడు కోరుకున్నవి ఇచ్చేశారు. దీంతో కొన్నేళ్ల పాటు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకడిగా హవా నడిపించాడు. కానీ ఏం లాభం.. ట్రేడ్ గేమ్‌లో ఫెయిలై అంతా కోల్పోయాడు. అదే పెద్దోడు తనకు వారసత్వంగా దక్కిన వాటిని మరింత మెరుపరచడమే గాక కొత్త వ్యాపారాల్లోనూ సక్సెస్ అయి అపర కుబేరుడిగా అవతరించాడు. ట్రంప్ నుంచి జుకర్‌బర్గ్ వరకు ప్రతి ఒక్కరూ తన గేట్ దగ్గర అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగాడు. మనం మాట్లాడుకుంటున్నది ఎవరి గురించి అనేది ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది.. అవును, అంబానీ బ్రదర్స్ గురించే ఈ ఉపోద్ఘాతం. ఒకప్పుడు సరిసమానంగా ఉన్న ఈ సోదరుల్లో ప్రస్తుతం అన్న ముకేశ్ ఆకాశంలో విహరిస్తుంటే.. తమ్ముడు అనిల్ మాత్రం ఓ అనామకుడిలా నేల మీదే పాకుతున్నాడు.
ముకేశ్ అంబానీకుమారుడు అనంత్-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అనిల్ అంబానీ హాజరయ్యాడు. అయితే అనిల్ కుటుంబ సభ్యుడిగా కాకుండా ఓ అతిథిలా పెళ్లికి రావడం చూసి చాలా మందికి బాధ వేసింది. అనామకుడిలా బ్యాగులో బట్టలు పెట్టుకొని, వాటిని ఆయన ఇద్దరు కుమారులు మోసుకుంటూ రావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 2005లో ఆస్తి పంపకాలు జరిగినప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ సమానంగా అన్నింటినీ పంచుకున్నారు. 2008లో వరల్డ్‌లోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్‌లో అనిల్ ఒకడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో రేంజ్‌కు పడిపోయాడు. సౌతాఫ్రికా టెలీ కమ్యూనికేషన్ కంపెనీతో అగ్రిమెంట్, అనంతరం చైనా కంపెనీలతో లీగల్ ఇష్యూస్ ఆయన పతనానికి ప్రధాన కారణంగా చెబుతారు.
ఆస్తి పంపకాల తర్వాత ముకేశ్ అంబానీకి సాంప్రదాయ ఆయిల్ రీటెయిల్డ్ గట్రా వచ్చాయి. అదే అనిల్‌కు మాత్రం ఆయన కోరుకున్న టెలీ కమ్యూనికేషన్స్, పవర్, ఎనర్జీ వంటివి వాటాకు వచ్చాయి. ఇవన్నీ బ్రైట్ ఫ్యూచర్, గ్రోత్ ఉన్న వ్యాపారాలు. అయినా సరే వాటిని నిలబెట్టుకోవడంలో, సంపదను పెంచడంలో ఆయన ఫెయిలయ్యాడు. ఒకప్పుడు మన దేశంలో రేమండ్స్ అధినేత ఇల్లు 30 అంతస్తుల్లో ఉండేది. దాని విలువ రూ.6 వేల కోట్లు. దాని తర్వాత భారత్‌లో రెండో ఖరీదైన ఇల్లు అనిల్ అంబానీదే. ఆయన ఇంటి విలువ రూ.5 వేల కోట్లు. కానీ ఏం లాభం.. ఇప్పుడు అనిల్ దాదాపు జీరో స్థాయికి చేరుకున్నాడు. ఆ మధ్య ఆయన ప్రయాణించిన కారును చూసి అందరూ షాకయ్యారు.
ఒకప్పుడు రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్గినీ గల్లార్డో, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంటి కార్లలో తిరిగే అనిల్.. రీసెంట్గా హ్యుండాయ్ ఐయోనిక్ 5 కారులో జర్నీ చేస్తూ కనిపించాడు. దీని ధర రూ.45 లక్షలు. అయితే టాప్ క్లాస్ కార్లలో తిరిగే వ్యక్తి.. ఇలా తన రేంజ్ కంటే ఎంతో కిందకు తగ్గి అందులో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అనంత్ పెళ్లిలో అనామకుడిలా ఓ బ్యాగు పట్టుకొని దర్శనమిచ్చాడు. దీంతో ఎంతలో ఎంత తేడా.. ఒకప్పుడు అత్యంత ధనికుడిగా వ్యాపార రంగంతో పాటు సినీ, రాజకీయ రంగాలపై తన డామినేషన్ చూపించిన వ్యక్తి ఇలా అయిపోయేసరికి అందరూ షాకవుతున్నారు. అన్న ఆకాశంలో ఎగురుతుంటే.. తమ్ముడు ఇలా అయిపోయాడేంటని బాధపడుతున్నారు. అనిల్ కొడుకులు అయినా నంబర్ వన్ స్థితిలో ఉండాలని ఆశిస్తున్నారు.
Anil Ambani Arrived at the Pre Wedding ❤️#anilambani pic.twitter.com/OwKEambHc6
— Viral Bhayani (@viralbhayani77) March 1, 2024