How To Increase Eyesight: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహార తీసుకుంటున్నారు. దీని వల్ల కంటి సమస్యలు, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు.
అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంపై శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగు పడడమే కాకుండా.. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కంటి చూపు మెరుగు పడడానికి క్రమం తప్పకుండా నట్స్, పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇంకా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కంటి చూపు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాల్నట్స్:
వాల్నట్స్‌లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కళ్లకు మేలు చేసే చాలా రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని నిపుణులు అభిప్రాయడుతున్నారు.
ఇందులో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి కళ్లను మెరుగు పరచడానికి సహాయపడుతాయి.
బాదం:
బాదంలో జ్ఞాపక శక్తికిని పెంచే చాలా రకాల మూలకాలు ఉంటాయి. అంతేకాకుండా కంటి చూపును పెంచే చాలా రకాల పోషక విలువలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది.
ఇవి రోజూ తీసుకోవడం వల్ల కంటిచూపును పెంచడమే కాకుండా కంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కావున కంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా వీటిని తీసుకోవాలి.
నేరేడు పండ్లు:
నేరేడు పండులో బీటా కెరాటిన్ మూలకం అధికపరిమాణంలో ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. నేరేడు పండులో విటమిన్ సి, విటమిన్ ఇ లు ఉంటాయి. ఇవి కంటి సమస్యలను దూరం చేస్తాయి.
కారెట్:
కారెట్‌లో బీటా కెరోటిన్ పోషకాలు కంటి చూపును పెంచడానికి బాగా సహాయపడుతుంది. కావున కంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా దీనిని రోజూ తీసుకోవాలి.
స్వీట్ పొటాటో:
స్వీట్ పొటాటోలో కంటి కావాల్సి అన్ని రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగురుపరచడమే కాకుండా.. కంటి సమస్యలను దూరం చేస్తాయి.