మిరియాలతో మీ స్టామినాను పెంచుకోండి.. క్యాన్సర్ కూడా రాదు..

www.mannamweb.com


మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో నల్ల మిరియాలు కూడా ఒకటి. వీటితో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు రాకుండా చేసుకోవచ్చు.

ఇవి శక్తికి గొప్ప మూలంగా చెబుతారు. ఆయుర్వేదంలో మిరియాలను అనేక సమస్యల నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు.

నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో స్టామినా అనేది పెరుగుతుంది. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగడం వల్ల కోల్పోయిన శక్తి లభిస్తుంది. ఎనర్జిటిక్‌గా ఉంటారు

కడుపు నొప్పి తగ్గించుకోవడంలో కూడా మిరియాల పొడి పని చేస్తుంది. బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి కలిపి తీసుకుంటే.. కడుపులో గ్యాస్, అసిడిటీ సమస్య తగ్గుతుంది. ఈ నీటిని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన కూడా కంట్రోల్ అవుతుంది.

చిగుళ్ల నొప్పిని నివారించడంలో కూడా మిరియాల పొడి ఉపశమనాన్ని ఇస్తుంది. జాజికాయ, రాళ్ల ఉప్పు, ఎండు మిర్చి, మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల చిగుళ్లకు పట్టించి.. అరగంట అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

మహిళల్లో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మిరియాలు తీసుకోవడం వల్ల లేడీస్‌లో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కూడా నివారిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )