హిందూ జనాభాలో టాప్ 5లో ఉన్న దేశం ‘గయానా’. ఈ జనాభాలో 24.9% మంది ప్రజలు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇక్కడ మొత్తం జనాభా 769,095 కాగా అందులో 190,966 మంచి హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు.
పశ్చిమ అర్ధగోళంలో అత్యధిక శాతం హిందూ నివాసితులు ఉన్న దేశంగా గయానా నిలిచింది.
‘ఫిజీ’లో హిందూ మతం రెండవ అతిపెద్ద మతం, మరియు ప్రధానంగా ఇండో-ఫిజియన్లలో అనుచరులు ఉన్నారు. వీరు బ్రిటిష్ వారు వలసరాజ్యాల చెరకు తోటల కోసం చౌక కార్మికులుగా ఫిజీకి తీసుకువచ్చిన ఒప్పంద కార్మికుల వారసులు. ఇక్కడ 935,974 మంది జనాభా ఉండగా ఇందులో 261,136 అంటే 27.9% ప్రజలు హిందీ మతాన్ని నమ్ముతున్నారు. ఇది టాప్ 5లో హిందూ దేశాల్లో 4వ స్థానంలో ఉంది.
‘మారిషస్’ 1,261,000 జనాభాలో 47.9% అంటే 650,000 మంది హిందువులు ఉన్నారు. ఫ్రెంచ్ మారిషస్‌కు భారతీయులను ఒప్పంద కార్మికులుగా తీసుకువచ్చినప్పుడు బ్రిటిష్ మారిషస్ తోటలో పొలాల్లో పని చేయడానికి చాలా ఎక్కువ సంఖ్యలో హిందూ మహాసముద్రంలోని పొరుగు దీవుల నుంచి హిందువులకు తీసుకొని రావటంతో హిందూ మతం మారిషస్‌కు వచ్చింది. ఈ జాబితాలో దీనిది థర్డ్ ప్లేస్.
అత్యధిక హిందువులు ఉన్న టాప్ 5 దేశాల్లో రెండో స్థానంలో నిచ్చింది ‘భారతదేశం’. ఇక్కడ ఇది అతిపెద్ద మతంగా ఉంది. భారత్ హిందూ మతానికి పుట్టినిల్లు అయినప్పటికీ ఇది సెక్యులర్ కంట్రీ. ఇక్కడ జనాభాలో 79.8% అంటే 1,053,000,000 మంది హిందువులే ఉన్నారు. ఈ దేశం మొత్తం జనాభా 1,320,000,000 మంది.
ఇదిలా ఉంటె టాప్ 1లో హిందూ దేశం ఏంటనేగా మీ సందహం. ఈ దేశంలో 81.19% మంది హిందూ మతాన్ని నమ్ముతున్నారు. అది మరేదో కాదు.. మన పొరుగు దేశం ‘నేపాల్’. రాచరికం రద్దు తర్వాత, ప్రజాస్వామ్యం ద్వారా ఆ దేశం తనను తాను లౌకిక దేశంగా ప్రకటించుకుంది. ఇక్కడ మొత్తం 29,164,578 జనాభాలో 23,677,744 మంది హిందువులే ఉన్నారు. అయితే సంఖ్య పరంగా మాత్రం భరత్ కంటే తక్కువ మందే ఇక్కడ ఉన్న హిందువులు.































