చరిత్ర సృష్టించనున్న భారత వాయుసేన కెప్టెన్‌ శుభాంశు శుక్లా.. నేడు రోదసీ యాత్ర

ఎట్టకేలకు బుధవారం ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా రోదసిలో అడుగు పెట్టనున్నారు శుభాంశు. మిగిలిన ముగ్గురు వ్యోమగాముల్లో అమెరికాకు చెందిన మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్, హంగేరీకి చెందిన టిబోర్ కపు, పోలెండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉన్నారు. యాక్సియం స్పేస్‌.

భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్‌ శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించబోతున్నారు. వాయిదాల మీద వాయిదాల తర్వాత ఆయన రోదసీ యాత్రకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు.. డ్రాగన్‌ వ్యోమనౌకలో నేడు రోదసియాత్రకు బయలుదేరుతున్నట్లు నాసా తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా బుధవారం నాడు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్​ సెంటర్​ నుంచి స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లనుంది. దీనిలో శుభాంశు శుక్లా మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ రోదసి యాత్ర ఇప్పటివరకు ఐదుసార్లు వాయిదా పడింది. మొదట ఇది మే 29న జరగాల్సి ఉండగా, ఆ తర్వాత జూన్ 8, జూన్ 10, జూన్ 11, ఆ తర్వాత జూన్ 19వ తేదీకి మారింది. జూన్ 11న జరగాల్సిన ప్రయోగానికి ముందు ఫాల్కన్-9 రాకెట్‌లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజీ కారణంగా వాయిదా పడింది.


ఎట్టకేలకు బుధవారం ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా రోదసిలో అడుగు పెట్టనున్నారు శుభాంశు. మిగిలిన ముగ్గురు వ్యోమగాముల్లో అమెరికాకు చెందిన మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్, హంగేరీకి చెందిన టిబోర్ కపు, పోలెండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉన్నారు. యాక్సియం స్పేస్‌ సంస్థతో పాటు అమెరికా, యూరప్‌, భారత అంతరిక్ష సంస్థలు ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ప్రయోగంతో శుభాంశు శుక్లా చాలా రికార్డులు సృష్టించనున్నారు.

ఈ వ్యోమనౌక భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ISS (International Space Station)తో అనుసంధానం కానుంది. రెండు వారాల పాటు ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఔత్సాహిక విద్యార్థులు, అంతరిక్ష శాస్త్రవేత్తలతో ఈ నలుగురు వ్యోమగాములు..ISS నుంచి సంభాషించనున్నారు.

అయితే శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర కోసం భారత్‌ రూ. 550 కోట్లు చెల్లించింది. భవిష్యత్తులో చేపట్టబోయే గగన్‌యాన్‌ ప్రాజెక్టులో పాల్గొననున్న శుక్లా.. అంతరిక్ష యాత్రతో గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు కావాల్సిన అనుభవం లభిస్తుంది. టేకాఫ్‌ టైమ్‌ జూన్‌ 25 మధ్యాహ్నం 12:01 గంటలు. 26న మధ్యాహ్నం 4:36 గంటలకు ISSతో డక్టింగ్‌ కానుంది. శుభాంశుతో పాటు అమెరికా, హంగరీ, పోలండ్‌ వ్యోమగాములు ఉన్నారు. ISSలో అడుగు పెట్టనున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించనున్నారు.

శుభాంశు శుక్లా ISSకు వెళ్లడం వల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనాలు

  • ISSలో శుభాంశు కీలకమైన ప్రయోగాలు చేయనున్నారు.
  • మైక్రో గ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం
  • మైక్రో గ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు
  • ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్ర సంబంధిత అంశాలపై అధ్యయనం
  • శుభాంశు శుక్లా 14 రోజుల పాటు ISSలో గడపనున్నారు
  • అంతర్జాతీయంగా ఇస్రోకు పెరగనున్న ప్రాముఖ్యత

1984లో రాకేష్‌ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం, భారతీయ యువతలో అంతరిక్ష రంగంపై ఆసక్తిని పెంచుతుంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్‌కు బూస్టప్ ఇస్తుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు.. భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం కూడా.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.