Indian Army: బీటెక్, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో 381 ఉద్యోగాలు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

Indian Army SSC Technical and Non Technical Recruitment: ఇండియన్ ఆర్మీలో 63వ, 34వ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) టెక్నికల్, నాన్-టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
దీనిద్వారా మొత్తం 381 ఖాళీలను భర్తీచేయనున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. టెక్నికల్ కోర్సులకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్; నాన్-టెక్నికల్ కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సు అక్టోబర్ 2024లో ప్రీ- కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీలో ప్రారంభం కానుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు జనవరి 23న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండు దశల రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


వివరాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య: 381.

➥ 63వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) పురుషులు: 350 పోస్టులు

ఇంజినీరింగ్ స్ట్రీమ్:సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్.

➥ 34వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మహిళలు: 29 పోస్టులు

ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.

➥ ఎస్ఎస్సీ డబ్ల్యూ (టెక్నికల్): 1 పోస్టు

➥ ఎస్ఎస్సీ డబ్ల్యూ (నాన్-టెక్నికల్): 1 పోస్టు
➥ ఎస్ఎస్సీ డబ్ల్యూ (నాన్-టెక్నికల్): 1 పోస్టు

అర్హత:టెక్నికల్ విభాగాలకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్; నాన్-టెక్నికల్ విభాగాలకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:01.10.2024 నాటికి 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పే స్కేల్:రూ.56,100- రూ.1,77,500.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.01.2024.

➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.02.2024.

➥ కోర్సు ప్రారంభం: అక్టోబర్ 2024.

Notification

Website