IRCTC పని చేయకపోయినా నో ప్రాబ్లం, ఈ సైట్లలో ఈజీగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు

www.mannamweb.com


రైల్వే ప్రయాణీకులు ఎక్కువగా IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, ఈ నెలలో రెండుసార్లు IRCTC వెబ్ సైట్ డౌన్ కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో అర్థం కాక అవస్థలు పడ్డారు. కొద్ది గంటల పాటు వేలాది మంది ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకోలేకపోయారు. ఉదయం 10 గంటల నుంచి IRCTC సైట్ ఓపెన్ కాలేదు. సైట్ మెయింటెనెన్స్ కారణంగా సర్వర్ డౌన్ అయినట్లు రైల్వే సంస్థ వెల్లడించింది. వినియోగదారులు IRCTC సైట్ యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు “మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా, ఇ-టికెటింగ్ సేవ అందుబాటులో లేదు. దయచేసి తర్వాత ప్రయత్నించండి” అనే మెసేజ్ డిస్ ప్లే అయ్యింది. ఒకే నెలలో రెండుసార్లు IRCTC సైట్ డౌన్ కావడం పట్ల ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా భారతీయ రైల్వే సంస్థతో పాటు రైల్వే మినిస్టర్ ను ట్యాగ్ చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

IRCTC సైట్ డౌన్ అయినా నో ప్రాబ్లమ్!

చాలా వరకు రైలు ప్రయాణీకులు IRCTC సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇది భారతీయ రైల్వే సంస్థ అధికారిక సైట్ కావడంతో ఫాస్ట్ గా, సేఫ్ గా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఫ్లాట్ ఫారమ్ మీద ఎక్కువగా టికెట్లు బుక్ చేసుకునేందుకు మొగ్గు చూపుతారు. అయితే, కొన్నిసార్లు IRCTC సైట్ డౌన్ కావడం వల్ల ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి సమయంలో కొన్ని ప్రత్యామ్నాయ సైట్లు లేదంటే యాప్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

IRCTCకి ప్రత్యామ్నాయ టికెట్ బుకింగ్ సైట్స్

⦿ MakeMyTrip: ప్రముఖ ట్రావెలింగ్ టికెట్స్ బుకింగ్ యాప్ MakeMyTrip లో అన్ని రకాల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైలు, విమానం, బస్సు టికెట్లతో పాటు హోటల్స్ ను కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ వినియోగదారులకు టికెట్ల బుకింగ్ పై స్పెషల్ డిస్కౌంట్లు కూడా అందిస్తుంది.

⦿ RailYatri: రియల్ టైమ్ రైలు అప్‌డేట్లు, టికెట్ బుకింగ్స్, జర్నీ ప్లానింగ్ ఫీచర్లను అందిస్తుంది RailYatri యాప్. ఇందులో కూడా రైలు టికెట్లు ఈజీగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

⦿ RedBus: తొలుత బస్ టికెట్ల బుకింగ్ కోసం అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ప్రస్తుతం.. రైలు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ యాప్ ద్వారా కూడా సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

⦿ Paytm: ప్రముఖ మనీ ట్రాన్స్ ఫర్ యాప్ Paytm రైలు టికెట్లను కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ యాప్ రైలు టికెట్ల బుకింగ్ పై క్యాష్‌ బ్యాక్ డీల్స్ ను కూడా అందిస్తుంది.

⦿ ConfirmTkt: రైల్వే టికెట్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్న సమయంలో ఈ యాప్ ద్వారా ఈజీగా కన్ఫర్మ్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. కన్ఫర్మ్ టికెట్ బుకింగ్స్ తో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు, రైళ్లు, సీట్లను కనుగొనడంలో ఈ యాప్ వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది.