క్రెడిట్ కార్డులపై భారతీయులకు పెరుగుతున్న మోజు.. 19 శాతం పెరిగిన సగటు వినియోగం

www.mannamweb.com


భారతదేశంలోని బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ వల్ల వినియోగదారులకు వివిధ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

డెబిట్ కార్డులను బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ బ్యాంకులు ఆటోమెటిక్‌గానే అందిస్తున్నాయి. అయితే గత ఐదేళ్ల నుంచి బ్యాంకులు క్రెడిట్ కార్డులను కూడా అదే స్థాయిలో అందిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులందరికీ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో జూలైలో భారతీయ వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ వినియోగంలో పెరుగుదలను ప్రదర్శించారని మార్కెట్ నిపుణులు చెబుతున్ానరు. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 19 శాతం పెరిగింది. ఎస్‌బీఐ సెక్యూరిటీస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డ్ వినియోగదారుల మొత్తం ఖర్చు రూ. 1.7 ట్రిలియన్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో పెరిగిన క్రెడిట్ కార్డు వినియోగం గురించి వివరాలను తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డుల వినియోగంలో గణనీయమైన పెరుగుదలను చూస్తే ప్రతి అవసరానికి క్రెడిట్ కార్డ్‌లపై ఆధారపడే వారి సంఖ్య పెరుగుతుందని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. లావాదేవీల వాల్యూమ్‌ల విషయానికి వస్తే సంవత్సరానికి 39 శాతం పెరిగి జూలై 2024లో మొత్తం 38.4 కోట్ల లావాదేవీలకు చేరుకుంది. లావాదేవీల సంఖ్యలో ఈ పెరుగుదల క్రెడిట్ కార్డ్‌లను విస్తృతంగా తీసుకోవడంతో పాటు ప్రతి అవసరానికి వాటిని వినియోగించే వారి సంఖ్య కూడా పెరిగిందని పేర్కొంటున్నారు. భారతదేశంలో ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ ఖర్చు జూలై 24లో 19 శాతం పెరిగి రూ. 1.7 ట్రిలియన్లకు చేరుకుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. బ్యాంకులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లావాదేవీల వాల్యూమ్‌ల పరంగా అగ్రగామిగా ఉందని దాని క్రెడిట్ కార్డ్‌లు నెలలో 9.9 కోట్ల లావాదేవీలను సులభతరం చేశాయని నివేదిక పేర్కొంది. ఐసిఐసిఐ బ్యాంక్ 7.1 కోట్ల లావాదేవీలతో దగ్గరగా ఉండగా, ఎస్‌బిఐ 6.3 కోట్ల లావాదేవీలతో మూడో స్థానంలో నిలిచింది.

లావాదేవీ విలువ పరంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులు జూలైలో తమ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా మొత్తం రూ. 44,369 కోట్లు ఖర్చు చేశారుు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ వరుసగా రూ.34,566 కోట్లు, రూ.26,878 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదనంగా సగటు లావాదేవీ విలువ కూడా జూలై 2024లో నెలవారీగా 1.4 శాతం స్వల్ప పెరుగుదలను సాధించింది. ఇది పది నెలల్లో ఏటీవీలో మొదటి పెరుగుదలను సూచిస్తుంది. మొత్తంమీద ఈ గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగంలో పెరుగుదలను గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు.