Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పై కీలక నవీకరణ వెలువడింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అయితే, తొలి విడతలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రారంభమయ్యేనాటికి ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న 71,480 మంది ఇళ్లు నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి మంజూరు చేశారు. బేస్మెంట్ పూర్తిచేసిన వారి అకౌంట్లలో ఈ నెల 15 నాటికి రూ. లక్ష చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.715 కోట్లు సిద్ధం చేస్తోంది. వీరికి దశలవారీగా రూ.5లక్షలు అందించనుంది.
Also Read
Education
More