దేశంలోని ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలు రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ స్పీడ్ పెంచాయి. వివిధ పొజిషన్స్ కోసం కొన్ని కంపెనీలు Walkin ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి.
మరికొన్ని, ఆన్‌లైన్ విధానంలో హైరింగ్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తున్నాయి. అయితే, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేయాలని చూస్తున్న టెక్ అభ్యర్థులకు తాజాగా Infosys కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది.
గ్రాడ్యుయేట్ ఫ్రెషర్లకు అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవకాశాన్ని కల్పిస్తూ అర్హులైన వారి నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తోంది. ఇండియాలో ఎక్కడి నుంచైనా పనిచేసుకునే ఫెసిలిటీని కల్పిస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం.
* అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు
దేశవ్యాప్తంగా ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లలో ఎంట్రీ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్ వరకు అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్లతో పాటు అనుభవం ఉన్న నిపుణులను కూడా కంపెనీ ఇంటర్వ్యూలకు ఇన్వైట్ చేస్తోంది. ఎంట్రీ లెవెల్ పోస్టులకు అప్లై చేసుకునే వారికి Degree qualification ఉంటే చాలు.
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కంపెనీ హైబ్రిడ్ మోడ్‌లో పనిచేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. వర్క్ ఫ్రం హోంతో పాటు ఆఫీసులో పనిచేసుకోవచ్చు.
* సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్
వినియోగదారుల అవసరాలను బట్టి సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలను డిజైన్, డెవలప్, టెస్ట్, ఇన్‌స్టాల్చేయగలగాలి. సరైన కోడింగ్ ప్రమాణాలు, పద్ధతులను పాటిస్తూ తప్పుల్లేని, సులువుగా మెయింటేన్ చేసుకోగలిగే కోడ్‌ని రాయాల్సి ఉంటుంది. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో విశ్లేషించి అందుకు అనుగుణమైన ప్యాకేజ్‌లను సిద్ధం చేయడం, వాటిని అమలు పరచడం వంటివి చేయాలి.
సాఫ్ట్‌వేర్ కోడ్‌ని క్షుణ్ణంగా టెస్ట్ చేసి అనుకున్న విధంగానే పనిచేస్తోందా? ఏమైనా బగ్స్ ఉన్నాయా? అని చెక్ చేయాలి. కోడ్‌లో సమస్యలను గుర్తించి వాటికి సరైన సొల్యూషన్స్ కనిపెట్టాలి. దీంతో పాటు కోడ్ డాక్యుమెంటేషన్, డివైజ్ కాన్ఫిగరేషన్, అప్రోచ్‌లను ఎప్పటికప్పుడు రాసిపెట్టుకోవాలి. పాట్రన్ మ్యాన్యువల్స్, టెక్నికల్ గైడ్స్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దీంతో పాటు టీమ్‌తో సరైన విధంగా కోఆర్డినేట్ అవుతూ బ్లాక్స్‌ని క్లియర్ చేసుకోవాలి. అవతలి వారికి సపోర్ట్ ఇవ్వగలగాలి.
* ఫ్రెషర్స్ క్వాలిఫికేషన్
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, తదితర సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 2025లో పాసైన, కాబోతున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక, అభ్యర్థులకు Java, Python, C++, తదితర programming languages వచ్చి ఉండాలి. SQL స్ట్రక్చర్స్‌పై బేసిక్ అవగాహన ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈజీగా జాబ్ సంపాదించుకోవచ్చు.
* జీతం
ఎంట్రీ లెవెల్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులకు సెలెక్ట్ అయ్యే అభ్యర్థులకు కంపెనీ మంచి శాలరీ అందిస్తోంది. ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ ఆధారంగా వీరికి నెలకు రూ.35 వేల నుంచి రూ.70 వేల మధ్య వేతనం ఉండనుంది. అనుభవం కలిగిన వారికి మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు తగ్గట్టు జీతం ఉంటుంది.
* ఎలా అప్లై చేసుకోవాలి?
ఇన్ఫోసిస్ వెబ్‌సైట్ www.infosys.com/careers లోకి వెళ్లి సంబంధిత పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.