Rain: వర్షాకాలంలో ఇంట్లోకి వచ్చే పురుగులకు ఇలా చెక్‌ పెట్టండి.. సింపుల్‌ టిప్స్‌

ఇలా వర్షాలు మొదలవుతాయో లేదో అలా పురుగులు ఇంట్లో వస్తుంటాయి. అప్పటి వరకు ఎక్కడ ఉండేవో కూడా తెలియని పురుగులు ఒక్కసారి దండయాత్ర చేసినట్లు దూసుకొస్తుంటాయి.


సాయంత్రం కాగానే వీధి దీపాల కింద, ఇంట్లో ఉండే లైట్స్‌ వద్ద కిటకిటలాడుతాయి. దీంతో ఈ పురుగుల వల్ల చికాకు రావడం ఖాయం. మరి ఈ పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఏవైనా చిట్కాలు లేవా.? అంటే కచ్చితంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఈ కీటకాలను తరిమికొట్టడంలో నిమ్మకాయ, బేకింగ్ సోడా లిక్విడ్ ఎంతగానో ఉపయోగ పడుంది. ఇందుకోసం కొంత నీటిలో నిమ్మకాయ రసం, బేకింగ్ సోడాను కలిపి ద్రావణంగా తయారు చేసుకోవచ్చు. ఈ లిక్విడ్‌ను ఒక బాటిల్‌లో పోసి, కీటకాలపై స్ప్రే చేస్తే సరిపోతుంది వెంటనే పారిపోతాయి.

* కీటకాలు నల్ల మిరియాల గాఢతను తట్టుకోవాలి. ఇందుకోసం ముందుగా నల్ల మిరియాలను పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం నీళ్లలో పోసి స్ప్రే చేస్తే కీటకాలను తరిమికొట్టొచ్చు.

* ఇక కిటీకిల నుంచి వచ్చే వెలుతురుకు కూడా అట్రాక్ట్‌ అయ్యి కీటకాలు వస్తుంటాయి. కాబట్టి వర్షాకాలంలో కిటికిలకు బ్లాక్‌ స్క్రీన్‌లను ఏర్పాటు చేసుకోవడం వల్ల పురుగులు ఆకర్షించబడవు.

* కీటకాలను తరిమికొట్టడంలో వేప నూనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేప నూనెను జల్లడం వల్ల పురుగులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

* వీటితో పాటు కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు మూసి వేయడం ఉత్తమమైన మార్గం. అలాగే కిటికీల మధ్య ఏవైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఫిల్‌ చేయాలి. ఇక సాయంత్రం పురుగులు వచ్చే సమయంలో ఇంట్లో లైట్స్‌ ఆఫ్ చేసి బయటి లైట్‌ ఆన్‌ చేయడం ద్వారా పురుగులు బయటకు వెళ్లిపోతాయి.

* ఇక లైట్స్‌ ఉన్న చోట ఆయిల్‌ రాసన న్యూస్‌ పేపర్స్‌ను ఏర్పాటు చేసినా పురుగులు వాటికి అతుక్కుపోతాయి. ఇలా కూడా పురుగులకు చెక్‌ పెట్టొచ్చు.