ఉద్యోగ భవిష్య నిధి (Employees’ Provident Fund) దీని గురించి చాలా మందికి కనీసం సమాచారం కూడా అందడం లేదు. ముఖ్యం పీఎఫ్(PF) ఖాతాదారులకు అందించే సేవల గురించి విస్తృత ప్రచారం కూడా లేదు.
ముఖ్యంగా ఐటీ, ప్రైవేట్, కార్మిక రంగాల్లో పని చేసే వారు దీని గురించి పెద్దగా పట్టించుకోరు కూడా. అయితే జీవిత భీమా గురించి ప్రజల్లో అవగాహన బాగా పెరుగుతున్న తరుణంలో EPFO కూడా తమ ఖాతాదారులకు అదనపు భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. ప్రీమియం లేకుండానే లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. దీనికి మనం చేయాల్సిందే ఏంటంటే…
EPFO పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రీమియం లేకుండానే లైఫ్ ఇన్సూరెన్స్ అందుతుంది. EPFO లో భాగమైన ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ EDLI పథకం ద్వారా, ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగి సర్వీసులో ఉండగా అకాల మరణం చెందితే, వారి కుటుంబానికి లేదా నామినీకి ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దరఖాస్తు చేయకుండానే EDLI స్కీమ్‌లో పీఎఫ్ ఖాతాదారులు ఆటోమేటిక్‌గా సభ్యత్వం పొందుతారు. పీఎఫ్ అకౌంట్ యాక్టివ్ గా ఉంటే చాలు.. అర్హత కలిగిన ప్రతి ప్రైవేట్ ఉద్యోగికి ఈ బీమా కవరేజీ వర్తిస్తుంది.
ఇన్యూరెన్స్ అమోంట్.. మొత్తం శాలరీ, EPF ఖాతాలో జమ అయ్యే కాంట్రిబ్యూషన్ల ఆధారంగా నిర్ణయించబడుతుంది. రూ.లక్ష నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా సాయం లభించే అవకాశముంది. ఉద్యోగి లాస్ట్ శాలరీ, సర్వీస్ పిరియడ్ ను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తాన్ని ఖరారు చేస్తారు.
ప్రధాన ప్రయోజనాలు
ఎంత సాధారణంగా లెక్కించినా కూడా గరిష్ట బీమా మొత్తం మరణం సంభవిస్తే రూ.7 లక్షల వరకు భీమా వస్తుంది. కనీసం చూసినా కూడా రూ.రెండున్నర లక్షలు నామినీకి అందుతాయి. ఈ బీమా కోసం ఉద్యోగి ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం.
ఎలా క్లైయిమ్ చేసుకోవాలంటే..
ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ ఈ క్లైమ్ ను అప్లై చేయాల్సి ఉంటుంది. ఫారం 5IF (Form 5IF) నింపి యజమాని సంతకంతో ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి. దీంతో పాటు మరణ ధృవీకరణ పత్రం , వారసత్వ ధృవీకరణ పత్రం, నామినీ బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ ఆధార్ కార్డులు కూడా జత చేయాలి.
బీమా మొత్తాన్ని ఎలా లెక్కిస్తారు?
బీమా మొత్తం అనేది ఉద్యోగి మరణానికి ముందు పొందిన గత 12 నెలల సగటు జీతంపై ఆధారపడి ఉంటుంది. (గత 12 నెలల సగటు జీతం X 35) + పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50% (గరిష్టంగా రూ.1.75 లక్షలు). మొత్తం కలిపి రూ. 7 లక్షలకు మించకూడదు.































