ఇంటర్, పదో తరగతి ఫలితాల పై కీలక నిర్ణయం

ఇంటర్మీడియట్ .. పదో తరగతి ఫలితాల వెల్లడి పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఏపీలోనూ ఇంటర్, పదో తరగతి ఫలితా ల విడుదల పైన విద్యా శాఖ కసరత్తు చేస్తోంది.


24న ఇంటర్ ఫలితాలు తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. ఫస్టియర్‌, సెకండియర్‌లో కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 10వ తేదీ వరకు మూల్యాంకణం పూర్తయ్యింది. అయితే, మార్కుల నమోదు పాటు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నెల 24న ఫలితాలను వెల్లడించాలని బోర్డు నిర్ణయించింది. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్లలో సంప్రదించాలని ఇంటర్‌ బోర్డు సూచించింది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల సౌలభ్యం కోసం మార్కుల జాబితాను వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు వివరించింది.

పదో తరగతి సైతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి.. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. అధికారుల ప్రణాళికలు అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ నెల చివరి వారంలో ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలవుతాయి లేదంటే మే తొలి వారం లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరులో ఏపీ పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్‌ నెంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఏపీలో లాగే పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెలాఖరు కల్లా వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ – https: //www.bse. telangana.gov.in లో పొందు పేర్చనున్నారు.

ముందుగానే ఫలితాలు ఇక, ఏపీలో ఇంటర్ ఫలితాలు ఈ సారి గతం కంటే వేగంగా విడుదల కానున్నాయి. మూల్యాంకనం తరువాత కంప్యూటరీకరణ చేసేందుకు 5-6 రోజుల సమయం పడుతుంది. వాట్సప్ లో ఫలితాలు ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారి ఫలితాలను వాట్సాప్‌ నంబర్ 9552300009 లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap. gov.in/ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.