Inter Supplementary: ఇంటర్ ఫెయిల్ అయిన వారు బాధ పడొద్దు – సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచంటే?

www.mannamweb.com


Inter Supplementary Exams Dates 2024: ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు (Inter Results) విడుదలయ్యాయి. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మేలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు రెగ్యులర్ లో పాస్ అయ్యారా.?, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా.? వంటివి మార్కుల జాబితాలో ఏమీ వివరాలు ఉండవని.. విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశానికి లోను కావద్దని అన్నారు.