రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్నటువంటి టాప్ హీరోస్‌లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ కానీ ఓపెనింగ్స్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి.
పవన్ తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికీ అభిమానుల్లో ఆయనపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఓజి’, ‘హరిహర వీరమల్లు’ సినిమాలతో రాబోతున్నాడు. అయితే ఇందులో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘ఓజి’ సినిమాని పవన్ కళ్యాణ్ ఎంత వేగంగా కంప్లీట్ చేసారో, అంతే గ్యాప్ కూడా ఇచ్చేసారు.
ప్రజంట్ అతని డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారట. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్‌గా మారింది. ఇటు అభిమానులు మాత్రం ఆయన నుంచి ఏ సినిమా రిలీజ్ అయిన పర్లేదు అనే ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇలాంటి హై టైం లో రిలీజ్ అయ్యే ఆయన మూవీ కచ్చితంగా నిర్మాతలకు జాక్ పాట్ లాంటిదే. అయితే ఈ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ అనుకుంటే మిస్ అయ్యింది కానీ, మళ్ళీ ఈ ఏడాదిలో అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనికంటే ముందు బ్లాస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ‘ఓజి’ టీజర్‌ని మేకర్స్ ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.