ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం పెద్ద విషయం ఏమి కాదు. డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఆ డబ్బులను సేవ్ చేసుకోవడం మాత్రం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఖర్చులు ఘోరంగా ఉన్నాయి. కరెంట్ బిల్లు, నీటి బిల్లు, ఇంట్లో సరుకులు, ఇంటి రెంట్, పాల బిల్లు, కూరగాయలు, హాస్పిటల్ ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు.. ఇలా ఒక్కటేమిటీ చాలా రకాల ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా సిటీ లల్లో ఉన్న ఉద్యోగులకు చాలా ఖర్చులు ఉంటాయి. క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్లు, పెట్రోల్ బిల్లులు లాంటి ఖర్చులు చాలా మందికి ఉంటాయి. ఇన్ని ఖర్చులు ఉన్న సామాన్య ప్రజలకు డబ్బులు మిగిల్చడం చాలా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే జీతాల కంటే ఖర్చులే ఎక్కువ. అయితే మనకు అయ్యే ఖర్చులో కేవలం 45 రూపాయలు తీసి పక్కన పెట్టారంటే భారీగా డబ్బులు మిగిలించుకోవచ్చు. అదెలాగో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీరు రోజుకి కేవలం 45 రూపాయలు సేవ్ చేసుకుంటే 25 లక్షల లాభం వచ్చే స్కీమ్ ఒకటి ఉంది. అదే LIC జీవన్ ఆనంద్ పాలసీ. LIC ఎన్నో మంచి మంచి స్కీమ్ లని అందిస్తుంది. వాటిలో ఈ పాలసీ కూడా ఒకటి. పైగా ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దీనిలో ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇందులో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇంకా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇక ఈ పాలసీ తీసుకోవడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టర్మ్ ప్లాన్ లాగా, ఈ పాలసీకి కూడా ప్రీమియం కట్టాలి. ఈ స్కీమ్ లో మాక్సిమం లిమిట్ అంటూ ఏమి లేదు. కాకుంటే కొంచెం పేషన్స్ ఉండాలి. అది ఉంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు.
ఇందులో 35 ఏళ్ల పాటు ఏడాదికి రూ.16,300 కట్టాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.1,358 కట్టాలి. ఇందులో బీమా మొత్తం రూ.5 లక్షలు, బోనస్ రూ.8 లక్షలు, ఎఫ్‌ఏబీ రూ.11.5 లక్షలు కలిసి ఉంటాయి. అలాగే ఈ పాలసీ మెచ్యూరిటీ తర్వాత కూడా లైఫ్ కవర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒకవేళ పాలసీ టర్మ్‌లో పాలసీదారుడు చనిపోయినట్లయితే డెత్ క్లెయిమ్ కూడా వస్తుంది. ఇందులో బీమా డబ్బులు, బోనస్ ఎఫ్‌ఏబీ కలిపి ఇస్తారు. అలాగే ఈ పాలసీలో మీకు ఎల్ఐసీకి వచ్చే లాభాల్లో వాటా కూడా వస్తుంది. అంతే కాదండోయ్ ఇందులో మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే ఇందులో మీకు వచ్చే డబ్బు పై ట్యాక్స్ కట్ అవ్వదు.